Monday, June 29, 2026
News Navigation
Monday, June 29, 2026
News Navigation

Breaking

Monday, June 29, 2026
Home Film RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

by CVR NEWS
RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరో, దర్శకుడిగా రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం #RAPO23 అధికారికంగా లాంచ్ చేశారు. ఎన్నో ఏళ్ల పాషన్, ప్లానింగ్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో రామ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ తెరకెక్కుతున్న చిత్రం ఇది.

ఈ చిత్రం ఈరోజు సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. నిర్మాత కృష్ణ పోతినేని స్క్రిప్ట్ ను రామ్ పోతినేనికి అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి పి. మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, పి.వి. రవి కిషోర్ క్లాప్ కొట్టారు. దర్శకుడిగా తన ప్రయాణానికి శ్రీకారం చుడుతూ తొలి షాట్‌కు రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహించారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజు హైదరాబాద్ శివార్లలో ప్రారంభమైంది. కథానాయకుడు రామ్ పోతినేని చిత్రంలోని ప్రధాన తారాగణంతో కలిసి షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ కథను స్వయంగా రామ్ పోతినేని రాశారు. నియో-నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీనిని రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని విభిన్న అంశాలను, ఆసక్తికరమైన పాత్రల ప్రయాణంతో ఈ చిత్రం ఉండబోతోంది.

దర్శకత్వం, కథతో పాటు ఈ చిత్రంలో రామ్ కథానాయకుడిగానూ నటిస్తున్నారు. కెమెరా ముందు, వెనుక బాధ్యతలు చేపట్టడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌పై ఆయనకున్న అంకితభావం స్పష్టమవుతోంది. తన కెరీర్‌లోనే అత్యంత సవాల్‌తో కూడిన పాత్రను ఆయన ఇందులో పోషించబోతున్నారు.

ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం పలువురు ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తున్నారు. తారాగణానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత తిరునావుకరసు (తిరు) సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హైన్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

విభిన్నమైన కథ, భారీ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల కలయికతో తెరకెక్కుతున్న #RAPO23, రామ్ పోతినేని కెరీర్‌లోనే ఒక మైలురాయి చిత్రంగా నిలవనుంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

035631
Total views : 180029

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.