Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Film ‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.

by CVR NEWS
‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్, జి.వి. ప్రకాశ్ కుమార్ ‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్‌కు తొలి పాట ఇరుముడి కట్టుతో అద్భుతంగా శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు లభించిన అద్భుత స్పందన, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ అద్భుతమైన ఫామ్ తో ఈ పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

‘ఇరుముడి కట్టు’ ఒక ఆధ్యాత్మిక భావోద్వేగాలతో కూడిన భక్తి పాట. జి.వి. ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ పాటలో అయ్యప్ప స్వామి భక్తి, నియమ నిష్ఠలు, మండల దీక్ష పవిత్రతను అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ స్వరకల్పన పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు అద్భుతమైన భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది.

ఈ పాటకు దర్శకుడు శివ నిర్వాణ, కళ్యాణ్ చక్రవర్తితో కలిసి సాహిత్యం అందించారు. అయ్యప్ప మాల ధరించి మండల దీక్ష చేపట్టిన ఓ భక్తుడు ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్ర చేసే పవిత్ర ప్రయాణాన్ని ఈ సాహిత్యం ఎంతో హృద్యంగా కనిపించింది. అయ్యప్ప మాల ధరించడం వెనుక ఉన్న ఆధ్యాత్మికత, నియమశిక్షణ, జీవిత సారాన్ని హీరో కోణంలో అద్భుతంగా చూపించారు. అనంతు పవర్ ఫుల్ వోకల్స్ ప్రతి పదానికి భక్తి భావాన్ని జోడించి పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు.

ఈ పాటలో రవితేజ అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తుడి పాత్రలో ఒదిగిపోయారు. ఆయన లుక్, భక్తి భావం, హావభావాలు, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాబా భాస్కర్ కోరియోగ్రఫీ పాటలోని ఆధ్యాత్మికతను మరింత గొప్పగా ఆవిష్కరించింది.

ఈ పాటలో రవితేజ భార్య, కుమార్తె పాత్రల్లో నటిస్తున్న ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర కనిపించే భావోద్వేగ సన్నివేశాలు కథకు మరింత ఎమోషన్ ని జోడించాయి. ‘ఇరుముడి కట్టు’ మనసును తాకే భక్తి గీతంగా నిలుస్తూ ‘ఇరుముడి’ సినిమా అందించబోయే ఎమోషనల్ జర్నీకి అద్భుతమైన ఆరంభాన్ని అందించింది.

ఈ చిత్రంలో సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

‘ఇరుముడి’ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: