Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన కోడిగుడ్డు ధరలు.

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన కోడిగుడ్డు ధరలు.

by CVR NEWS
తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన కోడిగుడ్డు ధరలు

తెలంగాణలో కోడిగుడ్డు ధరలు సామాన్యుడి వంటగది బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత మూడు నెలలుగా నిరంతరంగా పెరుగుతున్న ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ.9 వరకు విక్రయిస్తుండగా, త్వరలో రూ.10కి చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ప్రకారం హైదరాబాద్‌లో హోల్‌సేల్ ధర రూ.7గా ఉందని తెలుస్తుంది . వేసవి కారణంగా 10 శాతం కోళ్లు మృతి చెందడం, దాణా ఖర్చులు పెరగడం ఉత్పత్తిపై ప్రభావం చూపింది. మధ్యాహ్న భోజన పథకానికి కూడా ధరల పెరుగుదల సమస్యగా మారింది. రోజుకు 4 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నా డిమాండ్, సరఫరా మధ్య అసమతుల్యత కొనసాగుతోంది.

నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ గణాంకాల ప్రకారం హోల్‌సేల్ ధర రూ.7గా నమోదైంది. పౌల్ట్రీ రంగంలో వేసవి కారణంగా కోళ్లు మృతి చెందడం, ఉత్పత్తి తగ్గడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు . తెలంగాణలో సుమారు 4 వేల లేయర్ పౌల్ట్రీ ఫారాలు ఉండగా రోజుకు సుమారు 4 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నా వినియోగం అధికంగా ఉండటంతో సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. వర్షాకాలంలో పరిస్థితులు మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక కోడి గుడ్డు పెట్టేందుకు పెట్టే మేత, మెడిసిన్ కే తమకు రూ.7 పడుతోందని అంటున్నారు . మొన్నటి వరకూ పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయారని, గుడ్డు ధర పెరగడం వల్ల ఆ నష్టాల నుంచి రైతులు బయటపడతారని అభిప్రాయపడుతున్నారు. రైతులు నష్టపోవడం వల్ల వినియోగదారులపై ఆ భారం పడకతప్పడం లేదు .

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: