Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home International యూరప్ దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.

యూరప్ దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.

by CVR NEWS
యూరప్ దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు

యూరప్ దేశాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. అరుదైన ఒమేగా బ్లాక్ వాతావరణం కారణంగా ఏర్పడిన ప్రాణాంతక, రికార్డు స్థాయి హీట్ వేవ్ పశ్చిమ యూరప్ ను కమ్మేసింది. . ఈ నేపథ్యంలో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు పాఠశాలలు కూడా మూసివేశారు. ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు అత్యంత తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి.

యూరప్ లో వీస్తున్న వడగాల్పుల దాటికి ఓ అరుదైన సంఘటన కూడా చోటు చేసుకుంది. విపరీతమైన వేడికి ట్రాఫిక్ లైట్స్ కరిగిపోయాయి. ఇటలీ, జర్మనీలోని పలు నగరాలలో ఈ సంఘటనలు చోటు చేసుకున్న వీడియోలు వైరల్ గా మారాయి. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన ఈ తీవ్రమైన వడగాల్పులు తట్టుకోలేక ట్రాఫిక్ లైట్స్ వంకర తిరిగి కరిగిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు .

అరుదైన ఒమేగా బ్లాక్ వాతావరణ నమూనా కారణంగా పశ్చిమ యూరప్‌లో తీవ్ర హీట్‌వేవ్ కొనసాగుతోంది. బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు అత్యంత తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. ఈ నెల 21 నుంచి ఇప్పటివరకు వడగాలుల ప్రభావంతో దాదాపు 1,300 మంది మరణించినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందులో ఒక్క ఫ్రాన్స్‌లోనే వెయ్యికి పైగా మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది. అత్యవసర వైద్య సేవలపై తీవ్ర ఒత్తిడి నెలకొనగా.. వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: