Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Crime ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.

by CVR NEWS
ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. హర్యానాకు చెందిన కుటుంబం హరిద్వార్‌ వెళ్తుండగా దారి తప్పి, ఎగ్జిట్ కోసం కారును వెనక్కి తీస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లా, ‘హల్గోయా కట్’ వద్ద ఈ ప్రమాదం జరిగింది. హర్యానాలోని బహదూర్‌గఢ్‌కు చెందిన ఒక కుటుంబం హరిద్వార్‌కు కారులో బయలుదేరింది. కాగా, వీరు ప్రయాణిస్తున్న కారు సరైన ఎగ్జిట్ వేను మిస్ కావడంతో.. దానిని రివర్స్ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అతివేగంగా వచ్చిన స్కార్పియో కారు, వీరున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రమైన ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ దుర్ఘటనలో ప్రవీణ్ , అతని భార్య ప్రీతి , వృద్ధురాలైన సుదేశ్, మరియు తొమ్మిదేళ్ల బాలుడు శివాన్ష్ ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: