ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ సీనియర్ అధికారి రాజీనామా చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడిక్కింది. దీంతో సోషల్ మీడియాపై అప్రకటిత ఆంక్షలు అమలవుతున్నాయి. ఎన్నికల్లో అక్రమాల వ్యవహారంలో ఏకంగా సీఈసీ, సీజే హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ దేశ ఎన్నికల కమిషన్ వీటిని తోసిపుచ్చింది. వీటిపై దర్యాప్తు చేయడానికి ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఎన్నికల కమిషన్ నియమించింది. ఈ అంశంపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో ఈసీ సికందర్ సుల్తాన్ రాజా పాల్గొన్నారు. దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేసిన కమిటీ ఆయా జిల్లాల్లోని ఎన్నికల అధికారుల వాంగ్మూలాలను నమోదు చేసుకుని మూడు రోజుల్లో నివేదికను ఎన్నికల కమిషన్ కు అందజేయనుంది. మరోవైపు ఈ ఆరోపణలను రావల్పిండి కమిషనర్ పూర్తిగా తోసిపుచ్చారు. తమ పాత్ర ఎన్నికల్లో కేవలం సమన్వయం వరకే పరిమితం అవుతుందన్నారు. ముఖ్యంగా సైనిక నాయకత్వం కొలువుదీరి ఉండే రావల్పిండిలో దాదాపు 13 మంది అభ్యర్థులను బలవంతంగా విజేతలుగా ప్రకటించామని రావల్పిండి మాజీ కమిషనర్ లియాఖత్ అలీ ఛత్తా ఆరోపించడం సంచలనం సృష్టించింది. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.