గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్లు:
గూగుల్ మ్యాప్స్ జనరేటివ్ ఏఐ సాయంతో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫీచర్లను అందించనుంది. గూగుల్ మ్యాప్స్ దాదాపు 250 మిలియన్ ప్లేసెస్ ఇన్‌ఫర్మేషన్, 300 మిలియన్ల కాంట్రిబ్యూటర్స్ జాబితాను అనలైజ్ చేసి రెస్టారెంట్ రికమెండేషన్స్ వంటివి చేయనుంది. దీనికి సంబంధించి గూగుల్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మీరు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నారు అనుకుందాం. అక్కడ పురాతన కట్టడాలు, వింటేస్ ప్లేస్‌లు ఎక్స్‌ప్లోర్ చేయాలని కోరుకున్నారు. ఇందుకు మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు.
మహీంద్రా XUV400 ప్రో రేంజ్ కారు గ్రాండ్ రిలీజ్..
‘ప్లేసెస్ విత్ ఏ వింటేజ్ వైబ్స్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో’ అని గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేయండి. AI మోడల్స్ మ్యాప్స్ కమ్యూనిటీ నుంచి ఫోటోలు, రేటింగ్‌లు, రివ్యూలతో పాటు సమీపంలోని బిజినెసెస్, ప్లేసెస్ గురించి మ్యాప్స్ రిచ్ ఇన్‌ఫర్మేషన్‌ను విశ్లేషిస్తాయి. వినియోగదారులకు నమ్మదగిన సూచనలు అందిస్తాయి. ఫోటో కేరోసెల్స్ , రివ్యూలతో పాటు క్లాతింగ్ స్టోర్స్, వినైల్ షాప్స్, ఫ్లీ మార్కెట్‌లు వంటి ఆర్గనైజ్డ్ కేటగిరీలను కూడా వినియోగదారులు చూడవచ్చని పేర్కొంది. గూగుల్ మ్యాప్స్ బెస్ట్ రూట్‌తోపాటు ఇకపై బెస్ట్ ప్లేసెస్‌ను సైతం సూచిస్తుంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.