వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(World Test Championship) పాయింట్ల పట్టికలో టీమిండియా(Team India) అగ్రస్థానానికి దూసుకెళ్లింది. వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించడం భారత్‌కు కలిసొచ్చింది. ఆసీస్ గెలుపుతో కివీస్ ఖాతాలో ఉన్న డబ్ల్యూటీసీ పాయింట్లు 60కి తగ్గాయి. దీంతో 64.58 పాయింట్లతో ఉన్న భారత్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇక న్యూజిలాండ్‌పై గెలుపుతో ఆస్ట్రేలియా పాయింట్లు 55 నుంచి 59.09కి పెరిగినప్పటికీ ఆ జట్టు మూడవ స్థానానికే పరిమితమైంది.
ఇది చదవండి: సొంతగడ్డపై అదరగొట్టిన రోహిత్ శర్మ
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే 5వ టెస్ట్ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా(Team India) పాయింట్లు 68.51కి మెరుగవుతాయి. అలా జరిగితే అగ్రస్థానం మరింత పదిలమవుతుంది. ఇక క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగే రెండో టెస్టులో ఆసీస్‌పై న్యూజిలాండ్ గెలిచినా భారత్ అగ్రస్థానంలోనే ఉంటుంది. కాగా వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా విజయం 172 పరుగులతో తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కామెరాన్ గ్రీన్ అజేయంగా 174 పరుగులతో పాటు బౌలింగ్‌లో నాథన్ లియాన్ రాణించడంతో ఆసీస్ సునాయాసంగా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.