ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో పరుగుల వరద పారింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ హైస్కోరింగ్ సమరంలో ఇంగ్లండ్ పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ లోకి ప్రవేశించింది. ఇంగ్లండ్ బ్యాటర్ జాకబ్ బెతెల్ వీరోచిత సెంచరీతో పోరాడినప్పటికీ, ఆఖరి ఓవర్లో రనౌట్ రూపంలో వెనుతిరగడంతో ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ , కెప్టెన్ బట్లర్ , హ్యారీ బ్రూక్ త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ దశలో జాకబ్ బెతెల్ ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 105 పరుగులు చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అతనికి విల్ జాక్స్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి దూకుడుతో ఒకానొక దశలో ఇంగ్లండ్ గెలిచేలా కనిపించింది. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా, శివమ్ దూబే బౌలింగ్ కు దిగాడు. మొదటి బంతికే డేంజర్ మ్యాన్ బెతెల్ రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. జోఫ్రా ఆర్చర్ చివర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదినప్పటికీ, అప్పటికే ఆలస్యం కావడంతో ఇంగ్లండ్ 246 పరుగులకే పరిమితమైంది. మొత్తమ్మీద ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా, బుమ్రా, అర్ష్‌దీప్, అక్షర్, వరుణ్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు, టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా, భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ సంజు శాంసన్ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఇన్నింగ్స్ కు గట్టి పునాది వేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్, శివమ్ దూబే దూకుడుగా ఆడగా, చివర్లో తిలక్ వర్మ , హార్దిక్ పాండ్యా మెరుపులతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 61 పరుగులు సమర్పించుకోగా, జాక్స్, రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో భారత్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. 2024లో టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. ఇక, టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా…. న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టైటిల్ సమరం మార్చి 8న అహ్మదాబాద్ లో జరగనుంది.
sports
లక్నో వేదికగా ముంబై ఇండియన్స్(Mumbai Indians) తో జరిగిన మ్యాచ్(Match)లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) సునాయాస విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. లక్నో బ్యాటర్లలో స్టొయినిస్ 62 పరుగులతో రాణించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 28, దీపక్ హూడా 18 పరుగులతో పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. తుషార, నబీ, కోయెట్జీ తలో వికెట్ తీశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కి దిగిన ఎంఐ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నెహాల్ వధేరా 46, ఇషాన్ కిషన్ 32, టీమ్ డేవిడ్ 35 పరుగులు చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ 4, తిలక్ వర్మ 7, సూర్యకుమార్ యాదవ్ 10… స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ 2, నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, స్టొయినిస్ తలో వికెట్ పడగొట్టారు. లక్నో 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీలో కీలక పాత్ర పోషించిన స్టొయినిస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. పాయింట్ల పట్టికలో లక్నో మూడో స్థానానికి ఎగబాకింది. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.
- ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
- నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో గత నెల తుర్కియే పర్యటన తర్వాత విమానం మార్చినట్లు వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌కు బదులుగా భద్రతా కారణాలతో రహస్యంగా మరో విమానంలో అమెరికాకు చేరుకున్నట్లు తెలిపారు. ఆ బెదిరింపులకు…
- హార్ముజ్‌లో ఇరాన్ దూకుడు.స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. యూఏఈ ప్రభుత్వ రంగ చమురు సంస్థ ADNOCకు చెందిన నౌకలను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ లక్ష్యంగా చేసుకున్నట్లు యూఏఈ ఆరోపిస్తోంది. కేవలం ఒక్క వారంలోనే మూడు వేర్వేరు నౌకలపై క్షిపణి దాడులు జరిగినట్లు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఐపీఎల్-17(IPL-17)లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు ఎదురులేకుండా పోయింది. మైదానంలో అడుగుపెడితే విజయమే అన్నట్టుగా ఆ జట్టు దూకుడు కొనసాగుతోంది. లక్నో వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను 3 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(76), దీపక్ హుడా(50) సత్తాచాటారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనంతరం లక్ష్యాన్ని రాజస్థాన్ అలవోకగా ఛేదించింది. 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కెప్టెన్ శాంసన్(71 నాటౌట్), ధ్రువ్ జురెల్(52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ సీజన్లో రాజస్థాన్ చేతిలో ఓడటం లక్నోకు ఇది రెండోసారి. రాజస్థాన్‌కు వరుసగా ఇది నాలుగో గెలుపు. మొత్తంగా 8వది. దీంతో ఆ జట్టు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది.
- భూమి కావాలంటూ సీఎంను కోరిన రిషబ్ పంత్.టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో భూమి కొనుగోలు చేయడానికి మార్గం సుగమం చేయాలని కోరుతూ నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్…
- జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.UK పర్యటనలో నిరాశపరిచిన తర్వాత భారత్ కోరుకున్న ఫలితం ఇదే. జింబాబ్వే గడ్డపై ఆ జట్టును పూర్తిగా అధిగమించి 3-0 తేడాతో క్లీన్ స్వీప్ పూర్తి చేసింది. వాస్తవానికి ఈ సిరీస్ అంతటా జింబాబ్వే జట్టు భారత్‌కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత్…
- బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత్ ఆధిపత్యం.. జింబాబ్వేపై ఘన విజయం.భారత్‌కు ఇది పూర్తి సంతృప్తినిచ్చే విజయం. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసి జింబాబ్వేపై పూర్తిగా ఒత్తిడి తీసుకొచ్చి, వారిని తలొగ్గేలా చేసింది. 220 పరుగుల లక్ష్యం అంత సులభం కాదు, ముఖ్యంగా భారత్ వద్ద ఉన్న బలమైన పేస్ బౌలింగ్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు బెంగళూరు(Bangalore) రెండో విజయం సాధించింది. హైదరాబాద్(Hyderabad)తో జరిగిన పోరులో ఆజట్టు 35 పరుగుల తేడాతో నెగ్గింది. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితం అయింది. ఆ జట్టులో షాబాజ్ అహ్మద్ (40) టాప్ స్కోరర్. ఓపెనర్ అభిషేక్ శర్మ (31), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (31) చెలరేగారు.
ఇది చదవండి: LSG vs DC IPL 2024 | ఐపీఎల్ పదిహేడో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయం..
మిగతావారు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, గ్రీన్, కర్ణ్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. విల్ జాక్స్, యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన డుప్లెసిస్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 51, రజత్ పటిదార్ 50, కామెరూన్ గ్రీన్ 37, డుప్లెసిస్ 25 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు పడగొట్టగా, నటరాజన్ 2, కమిన్స్, మార్కండే ఒక్కో వికెట్ తీశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- భూమి కావాలంటూ సీఎంను కోరిన రిషబ్ పంత్.టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో భూమి కొనుగోలు చేయడానికి మార్గం సుగమం చేయాలని కోరుతూ నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్…
- జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.UK పర్యటనలో నిరాశపరిచిన తర్వాత భారత్ కోరుకున్న ఫలితం ఇదే. జింబాబ్వే గడ్డపై ఆ జట్టును పూర్తిగా అధిగమించి 3-0 తేడాతో క్లీన్ స్వీప్ పూర్తి చేసింది. వాస్తవానికి ఈ సిరీస్ అంతటా జింబాబ్వే జట్టు భారత్‌కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత్…
- బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత్ ఆధిపత్యం.. జింబాబ్వేపై ఘన విజయం.భారత్‌కు ఇది పూర్తి సంతృప్తినిచ్చే విజయం. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసి జింబాబ్వేపై పూర్తిగా ఒత్తిడి తీసుకొచ్చి, వారిని తలొగ్గేలా చేసింది. 220 పరుగుల లక్ష్యం అంత సులభం కాదు, ముఖ్యంగా భారత్ వద్ద ఉన్న బలమైన పేస్ బౌలింగ్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్(KL Rahul Captain Innings), క్వింటన్ డికాక్ అర్ధసెంచరీ దన్నుతో ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Supergiants in IPL-2024) మరో విజయాన్ని నమోదు చేసింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత మైదానంలో 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన లక్నో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. 53 బంతుల్లో 82 పరుగులు బాదిన కెప్టెన్ కేఎల్ రాహుల్ లక్నో గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
ఇది చదవండి: LSG vs DC IPL 2024 | ఐపీఎల్ పదిహేడో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయం..
అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా అర్ధ సెంచరీతో రాణించడంతో లక్నో గెలుపు సునాయాసమైంది. 31 బంతుల్లో 43 పరుగులే చేయాల్సిన కీలక స్థితిలో డికాక్ ఔటైనప్పటికీ పూరన్ 23 పరుగులతో నాటౌట్ గా నిలిచి రాహుల్‌తో కలిసి జట్టుని విజయతీరాలకు తీసుకెళ్లారు. 3 ఓవర్లలో 16 పరుగులు చేయాల్సిన సమయంలో రాహుల్ ఔట్ అయ్యాడు. అయితే స్టాయినిస్, పూరన్ కలిసి సులభంగా పరుగులు రాబట్టారు. చెన్నై బౌలర్లలో మతీశ పతిరన, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- భూమి కావాలంటూ సీఎంను కోరిన రిషబ్ పంత్.
- జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.
- బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత్ ఆధిపత్యం.. జింబాబ్వేపై ఘన విజయం.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) అదరగొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై గడ్డపై ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు చుక్కలు చూపించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబైపై 20 పరుగుల తేడాతో చెన్నయ్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నయ్ నిర్ణీత 20 ఓవర్లలో 206 స్కోరు చేసింది.
ఇది చదవండి: టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
రుతురాజ్ గైక్వాడ్(69), శివమ్ దూబె 66 హాఫ్ సెంచరీలతో మెరవగా.. ధోనీ 20 విలువైన పరుగులు జోడించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై 186 పరుగులకే పరిమితమైంది. రోహిత్ శర్మ105 అజేయ శతకంతో చేసిన ఒంటరి పోరాటం వృథా అయ్యింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన చెన్నయ్ బౌలర్ పతిరణ 4వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టీ20 క్రికెట్(T20 cricket)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ముంబై సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తో జరిగిన మ్యాచులో విక్టరీతో ముంబై ఇప్పటివరకు సాధించిన విజయాల సంఖ్య 150కి చేరింది. దాంతో ఈ మైలురాయిని సాధించి ప్రపంచంలోనే మొదటి జట్టుగా ఎంఐ అవతరించింది. ఈ ల్యాండ్‌మార్క్‌కు ఇంకా రెండు విజయాల దూరంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: RR vs DC IPL 2024 : రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం..!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఐపీఎల్ 2024(IPL 2024)లో మరో ఉత్కంఠభరిత పోరు జరిగింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)పై పంజాబ్ కింగ్స్(Punjab Kings) 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశ్‌తోష్ శర్మ అద్భుతంగా రాణించి జట్టుని విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా శశాంక్ సింగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
ఇది చదవండి: Virat Kohli T20 : టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..!
కడ వరకు క్రీజులోనే ఉండి కేవలం 29 బంతుల్లోనే 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. శశాంక్ సింగ్ వీరోచిత ఇన్నింగ్స్‌కు అశ్‌తోష్ శర్మ చక్కటి సహకారం అందించాడు. 17 బంతుల్లో 31 పరుగులు రాబట్టాడు. విజయం లాంఛనం అయిన తర్వాత అశ్‌తోష్ ఔట్ అయినప్పటికీ మిగతా పనిని శశాంక్ పూర్తి చేశాడు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
RCB Vs LSG IPL Match 2024:
సొంత గడ్డపై ఆర్సీబీ మళ్లీ బోల్తా పడింది. మంగళవారం (ఏప్రిల్ 2) రాత్రి లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ(RCB) టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు క్వింటన్ డి కాక్ (81) అర్ధ సెంచరీతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు చతికిల పడింది. 153 పరుగులకు ఆలౌటై హోం గ్రౌండ్లో 28 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.’
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: CSK Vs GT Match 2024 : చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం..!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్6 వికెట్ల తేడాతో ఘన విజయం..
ముంబై(Mumbai)తో జరిగిన మ్యాచ్(Match)లో రాజస్థాన్(Rajasthan) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ముంబై టీం కి ఓటమి పరంపర కొనసాగినట్టైంది. 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో రియాన్ పరాగ్ మెరుపులు కురిపించాడు.
ఇది చదవండి: IPL 2024 : ఐపీఎల్- 2024 పూర్తి షెడ్యూల్ విడుదల
రాజస్థాన్‌కిది మూడవ విజయం కాగా ముంబైకి వరుసగా ఇది మూడో ఓటమి. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని రాజస్థాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు ట్రెంట్ బౌల్ట్, చాహల్ చెరో 3 వికెట్లతో చెలరేగడంతో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి