ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు బెంగళూరు(Bangalore) రెండో విజయం సాధించింది. హైదరాబాద్(Hyderabad)తో జరిగిన పోరులో ఆజట్టు 35 పరుగుల తేడాతో నెగ్గింది. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితం అయింది. ఆ జట్టులో షాబాజ్ అహ్మద్ (40) టాప్ స్కోరర్. ఓపెనర్ అభిషేక్ శర్మ (31), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (31) చెలరేగారు.
ఇది చదవండి: LSG vs DC IPL 2024 | ఐపీఎల్ పదిహేడో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయం..
మిగతావారు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, గ్రీన్, కర్ణ్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. విల్ జాక్స్, యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన డుప్లెసిస్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 51, రజత్ పటిదార్ 50, కామెరూన్ గ్రీన్ 37, డుప్లెసిస్ 25 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు పడగొట్టగా, నటరాజన్ 2, కమిన్స్, మార్కండే ఒక్కో వికెట్ తీశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం..!లక్నో వేదికగా ముంబై ఇండియన్స్(Mumbai Indians) తో జరిగిన మ్యాచ్(Match)లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) సునాయాస విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. లక్నో…
- నాలుగో విజయంతో ముందుకు వెళుతున్న రాజస్థాన్..ఐపీఎల్-17(IPL-17)లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు ఎదురులేకుండా పోయింది. మైదానంలో అడుగుపెడితే విజయమే అన్నట్టుగా ఆ జట్టు దూకుడు కొనసాగుతోంది. లక్నో వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను 3 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్…
- Hyderabad Vs Bangalore : బెంగళూరు రెండో విజయం..ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు బెంగళూరు(Bangalore) రెండో విజయం సాధించింది. హైదరాబాద్(Hyderabad)తో జరిగిన పోరులో ఆజట్టు 35 పరుగుల తేడాతో నెగ్గింది. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.