దేశ ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వివరాలు………!
ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో నేడు పర్యటించనున్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. లోక్ సభ ఎన్నికల శంఖారావం లో భాగంగా అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాన మంత్రి పర్యటన. ఢిల్లీ(Delhi) నుండి బయలు దేరి ఉదయం 10 గంటల 20 నిమిషాలకు అదిలాబాద్ జిల్లా కేంద్రంలోనీ హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 10 గంటల 30 నిమిషాలకు రోడ్డు మార్గం గుండా జాతీయ స్థాయిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేయనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. 11గంటల 5 నిమిషాలకు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంఖుస్థాపన కార్యక్రమాల అనంతరం అదిలాబాద్ జిల్లా కేంద్రం లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో పాల్గోని ప్రసంగించనున్న ప్రధాన మంత్రి. 12 గంటల 15 నిమిషాలకు తిరిగి ప్రధాన మంత్రి హెలికాప్టర్ ద్వారా వెళ్లానున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
PM Modi: ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు…
2వేల మంది పోలీసులు, కమెండోలు. ఎస్పీజీ వలయంలో స్టేడియం, ఏరోడ్రమ్. ప్రధాని మోదీ ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు పోలీస్ శాఖ మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 15 జిల్లాలకు చెందిన 1700 మంది పోలీసులతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వారిని పది సెక్టార్లుగా విభజించి విధులు కేటాయించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), గ్రేహౌండ్స్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ) వంటి కేంద్ర బలగాలకు చెందిన మరో 300 మందితో రక్షణ కల్పించనున్నారు. మొత్తం 2 వేల మంది పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రధానితో
సీఎం రేవంత్ రెడ్డి……….!
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నరు ఉదయం 8గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి 9గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటారు. ఉదయం 9.30 నుంచి 11.15 గంటల వరకు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రధాని మోదీతో కలిసి వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన లో పాల్గొంటారు మధ్యాహ్నం 12గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరి వెళ్తానున్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి