తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టి..
ఫ్రాన్స్(France) చారిత్రాత్మక(Historical) నిర్ణయం తీసుకుంది. అబార్షన్‌ను రాజ్యాంగబద్ధ హక్కుగా మార్చింది. ఫ్రెంచ్ పార్లమెంట్ భవనం వెర్సైల్లెస్ ప్యాలెస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఈ బిల్లుకు ఎంపీలు అనూహ్య మద్దతు ఇచ్చారు. బిల్లును కేవలం 72 మంది ఎంపీలు వ్యతిరేకించగా ఏకంగా 780 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో గర్భస్రావం రాజ్యాంబద్ధ హక్కుగా మారిపోయింది. గర్భస్రావాన్ని రాజ్యాంగ హక్కుగా మార్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది.
ప్రధాని గాబ్రియేల్ అట్టల్ వ్యాఖ్యాలు..
మీ శరీరం మీది మీ విషయంలో ఇతరులు నిర్ణయం తీసుకోలేరు అని ఓటింగ్‌కు చట్టసభలో ప్రధాని గాబ్రియేల్ అట్టల్ వ్యాఖ్యానించారు. ఈ సందేశాన్ని ఇక్కడి నుంచి మహిళలు అందరికీ పంపుతున్నామని ఆయన అన్నారు. పార్లమెంట్ నిర్ణయాన్ని అక్కడి మహిళా హక్కుల సంఘాలు స్వాగతించాయి. సెంట్రల్ ప్యారిస్‌లో గుమిగూడిన అబార్షన్ హక్కుల కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని తెలియజేశారు.
పార్లమెంట్‌లో భారీ మెజారిటీతో ఆమోదం పొందిన బిల్లు..
పార్లమెంట్‌లో ఓటింగ్ ఫలితాన్ని భారీ స్క్రీన్ పై ప్రదర్శించారు. అనంతరం ‘నా శరీరం నా హక్కు’ అనే సందేశాన్ని కూడా స్క్రీన్‌పై ప్రదర్శించారు. మరోవైపు అబార్షన్ వ్యతిరేక సంఘాలు ఈ చట్టంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. ‘అబార్షన్ రాజ్యాంగబద్ధ హక్కు కాదు’ అంటూ 2022లో అమెరికా సుప్రీంకోర్ట్ తేల్చి చెప్పిన నాటి నుంచి ఫ్రాన్స్‌లో కార్యకర్తలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అబార్షన్‌కు రాజ్యాంగ చట్టబద్ధత కల్పించాల్సిందేనని పట్టుబట్టారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: సొంతగడ్డపై అదరగొట్టిన రోహిత్ శర్మ
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.