వాట్సాప్(WhatsApp)లో డెలీట్డ్ మెసేజ్ చదవడానికి ఓ ట్రిక్..
వాట్సాప్(WhatsApp)లో డెలీట్డ్ మెసేజ్ చదవడానికి ఓ ట్రిక్ ఉందట. మరి ఆ ట్రిక్(Trick) ఏంటి? ఒకసారి పంపి డిలీట్ చేసిన మెసేజ్ ఎలా చదవొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాట్సాప్ ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తోంది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తున్న వాట్సాప్(WhatsApp) వినియోగదారుల గోప్యతపై కూడా దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో అనుకోకుండా పంపిన మెసేజెస్, ఒకరికి పంపబోయి మరొకరికి పంపిన మెసేజెస్ డిలీట్ చేసే ఫీచర్‌ను జోడించింది వాట్సాప్. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఒకసారి సందేశాన్ని పంపిన తర్వాత దాన్ని తొలగించవచ్చు. అలా డిలీట్ చేశాక ఈ సందేశాన్ని ఎవరూ చదవలేరు. అయితే చాలా మంది వినియోగదారులకు ఇలాంటి తొలగించిన సందేశాల పట్ల ఓ రకమైన క్యూరియాసిటీ ఉంటుందనే మాట వాస్తవం. అయితే డిలీట్ చేసిన సందేశాలను చదవడానికి అధికారిక మార్గం లేదు గానీ ఓ ట్రిక్(Trick) సహాయంతో చదవొచ్చు అని కొందరు చెబుతున్నారు. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ మీరు నోటిఫికేషన్ హిస్టరీ పొందుతారు. ఆ తర్వాత టోగుల్‌ను ఆన్ చేసి డిలీటెడ్ మెసేజ్ చదవొచ్చు అంటున్నారు. మీ ఫోన్‌లో వచ్చే ఏదైనా నోటిఫికేషన్(Notification), దాని హిస్టరీ అనేది 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా వాట్సాప్ సందేశాన్ని తొలగించినట్లయితే ఇలా యాక్సెస్ చేయవచ్చు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: జూన్ లో ‘గూగుల్ పే’ సేవలు బంద్..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.