కాజీపేట రైల్వే స్టేషన్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం (kazipet fire accident)
హనుమకొండ జిల్లా, కాజీపేట రైల్వే స్టేషన్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం(fire accident) చోటు చేసుకుంది. రిపేర్ ల కోసం నిలిపిన రైల్ బోగీ నుండి భారీగా పొగలు. భయాందోళనకు గురైన ప్రయాణీకులు, అధికారులు. మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు. ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. ప్రమాదంపై విచారణ చేస్తున్న పోలీసులు.
గూడ్స్ ట్రైన్ (goods train)బొగ్గు వ్యాగన్ లో నిప్పంటుకుని పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు చెలరేగి పక్కనే నిలిపి ఉంచిన ప్యాసింజర్ రైలుకు అంటుకున్నాయి. దీంతో పలు బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. స్టేషన్ లోని ప్లాట్ ఫాంలకు దూరంగా ఉన్న పార్కింగ్ ట్రాక్ లపై ఈ అగ్ని ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. గూడ్స్ రైలులోని బొగ్గుకు నిప్పంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి