తిరుపతి జిల్లా(Tirupati) శ్రీ కాళహస్తి స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం,
త్రిలోకపావనుడు, త్రినేత్రుడు, అయిన ఆ పరమేశ్వరుడు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో(Mahashivratri Brahmotsavam) భాగంగా దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో దేవేరితో కలిసి నవ నవోన్మేషుడై శివ పార్వతులు నారదపుష్కరిణి లో తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
బ్రహ్మ రాత్రి పురస్కరించుకొని జోడు రథాలపై ఊరేగుతూ దర్శనమిచ్చిన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత సోమ స్కంద మూర్తి ఉత్సవర్లు , రాత్రి నారద పుష్కరిణిలో అలలపై తేలియాడుతూ భక్తకోటికి ఆనందాన్ని కలిగించారు ,
శ్రీకాళహస్తి దేవస్థానంలో నినెప్పల మండపం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పట్టణం నడిబొడ్డులో ఉన్న నారదపుష్కరిణి తీసుకొనివచ్చారు , పట్టువస్త్రాలు విశేష స్వర్ణాభరణాలతో సర్వాంగసుందరంగా సిద్ధమైన స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేర్వేరు తెప్పల పై ఉంచి వేదపండితుల మంత్రోచ్ఛారణలు మేళతాళాల భక్తుల శివనామస్మరణ మధ్య తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది
నారద పుష్కరణి అలా పై ఉత్సవమూర్తులు ఐదు ప్రదక్షిణాలు చేశాక, దూప దీప నివేదనాది కైంకర్యాలు ఘనంగా చేపట్టారు.
మునుపెన్నడూ లేని విధంగా తెప్పోత్సవాన్ని తిలకించేందుకు విశేషరీతిలో భక్తులు తరలివచ్చారు.
భక్తజనసందోహంతో వైష్ణవ పుష్కరిణి కొంగొత్త శోభసంతరించుకుంది దీంతో భక్త జన సందోహం
తెప్పోత్సవం అత్యంత రమణీయంగా కమనీయంగా .
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి