ఎన్ఐఏ అధికారులు:
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు దాదాపు 30కి పైగా చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్(Punjab), హర్యానా(Haryana), రాజస్థాన్(Rajasthan), చండీఘడ్(Chandigarh), మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రాల్లోని 30 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ రైడ్స్ చేస్తోంది. ఉగ్రవాదుల(Terrorists), గ్యాంగ్ స్టర్లతో లింకున్న కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజాము నుంచే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసు బృందాలు ఈ భారీ ఆపరేషన్లో భాగం అయ్యాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఉగ్రవాదం కేసు విచారణలో భాగంగా అనుమానిత నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, జనవరి ఆరో తేదీన ఉగ్రవాదం, గ్యాంగ్ స్టర్, డ్రగ్ స్మగ్లింగ్ కు చెందిన భారీ కుట్రను ఎన్ఐఏ అధికారులు భగ్నం చేశారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు చెందిన నాలుగు ప్రాపర్టీలను అధికారులు సీజ్ చేశారు. 1967 నాటి యూఏపీఏ చట్టిం కింద ఆ ఆస్తుల్ని ఎన్ఐఏ జప్తు చేసింది. అక్రమంగా వస్తున్న నిధుల్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇది చదవండి: వెలుగులోకి వచ్చిన దారి దోపిడీ..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి