ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత..
ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను ఉంచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను ఈడీ ఆఫీసర్ భానుప్రియ మీన టీమ్ హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే కవిత ఉండనున్నారు. శనివారం ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. దీంతో ఢిల్లీ కార్యాలయం వద్ద పటిష్ట భద్రత అమలు చేశారు. బీఆర్ఎస్ నేతలు(BRS leaders), కార్యకర్తలు భారీగా ఈడీ కార్యాలయం వద్దకు వెళ్లారనే అంచనాలతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈడీ ఆఫీసు వద్ద 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇది చదవండి: లక్ష మందితో మోడీ భారీ బహిరంగ సభ…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి