స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ..
ప్రస్తుతం దేశంలో 1.25 లక్షలకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయని దీని ద్వారా 12 లక్షల మంది యువత ఉపాధిని పొందుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. ఢిల్లీ(Delhi) లోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన స్టార్టప్(Startup) మహాకుంభ్ కార్యక్రమానికి ప్రధాని హాజరయ్యారు. దేశంలోని స్టార్టప్(Startup)లలో 45 శాతం పైగా భారతీయ మహిళలు అగ్రగామిగా ఉండి విజయం సాధించారని ప్రధాని వెల్లడించారు. ఈ క్రమంలో వ్యవసాయం, జౌళి, వైద్యం, రవాణా, అంతరిక్షం, యోగా, ఆయుర్వేదం వంటి రంగాల్లో స్టార్టప్‌లు మొదలైనందుకు సంతోషిస్తున్నట్లు మోదీ తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరోవైపు రాజకీయాల్లో కూడా కొంతమంది స్టార్టప్‌లు ప్రారంభిస్తున్నారని ప్రధాని గుర్తు చేశారు. అలాంటి వారు ప్రయోగం విజయవంతం కాకపోతే, వెంటనే మరొకదానికి వెళ్లాలని సూచించారు. భారతీయ స్టార్టప్‌లు 50కి పైగా అంతరిక్ష రంగాలలో పని చేస్తున్నాయని చెప్పారు. గత దశాబ్దంలో ఐటి, సాఫ్ట్‌వేర్ రంగంలో భారతదేశం గొప్ప పురోగతిని సాధించిందని మోదీ అన్నారు. ఇప్పుడు భారతదేశం ఆవిష్కరణ, స్టార్టప్ సంస్కృతిని కూడా అభివృద్ధి చేయడంలో వేగంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు.
ఇది చదవండి: బ్యాంకు ఆర్థిక లావాదేవీలపై నిఘా…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి