ఎలివేటెడ్ కారిడార్(Karimnagar Elevated Corridor) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…
మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో కరీంనగర్ టు హైదరాబాద్ రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు. శంకుస్థాపన కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ శ్రేణులు తరలిరావాలని విజ్ఞప్తి – డా.కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కరీంనగర్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కరీంనగర్ – హైదరాబాద్(Karimnagar – Hyderabad) జాతీయ రహదారిలోని మిలటరీ ఏరియా ఎలివేటెడ్ కారిడార్ మంజూరు కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చేసిన కృషి ఫలించినది, మిలటరీ ఏరియాలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలతో రహదారి గుండా ప్రయాణించే ప్రజలు పడుతున్న తీవ్ర ఇబ్బందులను గమనించిన తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని తేది.15-12-2023 రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) గారికి రాసిన లేఖ ద్వారా విజ్ఞప్తి చేయగా, ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి అనుమతులు కోరగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరించే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోనందున విపరీతమైన ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చొరవతో మిలటరీ ఏరియాలోని ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు లభించడం పట్ల కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కారిడార్ ఏర్పాటు కోసం ప్రత్యేక చొరవ చూపిన పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
ఈనెల 7వ తేదీన సాయంత్రం 4.గంటలకు, కంటోన్మెంట్ ఏరియా(Cantonment Area)లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం జరగనున్నందున ఇట్టి కారిడార్ నిర్మాణంతో అధిక ప్రయోజనం చేకూరనున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు, సిద్దిపేట మరియు హన్మకొండ జిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ బ్లాక్, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు నియోజకవర్గస్థాయి, మండల స్థాయి, ముఖ్య నేతలు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పక విచ్చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాము.
- డా.కవ్వంపల్లి సత్యనారాయణ, మానకొండూరు ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కరీంనగర్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి