Jaishankar:
ఉగ్రవాదాన్ని తేలికగా తీసుకునే స్థితిలో భారత్(India) లేదని అన్నారు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్. సింగపూర్(Singapore) పర్యటనలో భాగంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్(National University of Singapore) కు చెందిన ఓ ఇనిస్టిట్యూట్(Institute) లో ప్రసంగించారు. పాక్, చైనాల చర్యలను ఖండించారు. పాక్ ఉగ్రవాద పరిశ్రమలా పని చేస్తోందని మండిపడ్డారు. అయితే భారత్ ఉగ్రవాదాన్ని చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. సమస్యలకు పరిష్కారాలు వెతకాలని సూచించారు. సమస్య నుంచి తప్పించుకోవడం వల్ల తిరిగి ఇబ్బందులే ఎదురవుతాయని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ప్రతి దేశం పొరుగు దేశంతో సత్సంబంధాలు కోరుకుంటుందన్నారు. పాక్ తో సంబంధాల కోసం ఉగ్రవాదాన్ని అయితే చూసీచూడనట్టు వదిలేయం అని క్లియర్ గా చెప్పారు జైశంకర్. మరోవైపు చైనా ప్రవర్తనపైనా జైశంకర్ మండిపడ్డారు. సేలా సొరంగ మార్గాన్ని మోడీ ఇటీవలే ప్రారంభించారు. అయితే అది తమ భూభాగమని.. సరిహద్దు వివాదం భారత్ వల్లే ముదురుతుందన్న చైనా మాటలను కొట్టిపారేశారు జైశంకర్. చైనా వ్యాఖ్యలు ఓ జోక్ అని.. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగం అని నొక్కి చెప్పారు.
ఇది చదవండి: దేశానికి తాగునీటి గండం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి