తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ(Garuda Seva)..
తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో సోమవారం నాడు పౌర్ణమిని పురస్కరించుకొని గరుడసేవ వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి నాడు మలయప్ప స్వామి వారు గరుడ వాహనంను అధిరోహించి భక్తులను కటాక్షించడం ఆనవాయితీగా వస్తొంది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు.
గరుడ వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శనంతో సప్తగిరులు గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి