Health Tips:
నల్ల మిరియాల(Black Pepper)లో కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కెరోటిన్, థైమ్ వంటి పోషకాలు ఉంటాయి. ఎంత పెద్ద హైబీపీ(High BP) అయినా సరే సులువుగా నియంత్రించవచ్చు. అధిక రక్తపోటును హైపర్‌టెన్షన్ అంటారు. ధమనుల నుంచి శరీర భాగాలకు రక్త ప్రసరణ చేయడానికి గుండె ఎక్కువ శక్తితో రక్తాన్ని పంపింగ్ చేయాల్సి వస్తే ధమనుల ఆరోగ్యం దెబ్బతిని తీవ్రమైన స్ట్రోక్ వవస్తుంది. ఈ తరహా అనారోగ్యాన్ని నల్ల మిరియాలతో సులువుగా నియంత్రించుకోవచ్చు. ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనం అదే. బీపీ 120/80 మధ్య ఉంటే సాధారణం. 140/90 కంటే ఎక్కువ ఉంటే హైపర్‌టెన్షన్ గా పిలుస్తారు. ఇంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించాలి. అకస్మాత్తుగా రక్తపోటు పెరగడాన్ని నల్ల మిరియాలద్వారా తగ్గించుకోవచ్చు. ఖాళీ కడుపుతో తింటే బీపీ ఎక్కువ తక్కువలు అదుపులోకి వస్తాయి.
ఇది చదవండి: ఎండ కాలంలో రోగాలను మాయం చేసే బాదం జ్యూస్
మసాలాలో రాజుగా పరిగణించే నల్ల మిరియాలను ఆహారాల్లో వాడటంవల్ల రుచి పెరుగుతుంది. ఒక గ్లాసు నీటిలో అర చెంచా నల్ల మిరియాల పొడి కలిపి తాగితే రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఉంటుంది. వీటిలో ఉండే పైపెరిన్ అనే సమ్మేళనం ఆహారం త్వరగా జీర్ణం అవడంలో సహాయపడుతుంది. హైబీపీకి ఎలుకల్లో చేసిన ప్రయోగాల ప్రకారం వీటిల్లో ఉండే పైపెరిన్ షుగర్ లెవల్స్ ను కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. గుండె, పేగుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 46 శాతం మందికి రక్తపోటు ముప్పు ఉంటోంది. ఉప్పును ఎక్కువగా ఉపయోగించడంతో పాటు శారీరకంగా ఎటువంటి శ్రమ లేకపోవడం, స్మోకింగ్ చేయడం, మద్యం సేవించడంతోపాటు నిద్రలేమి, కిడ్నీ వ్యాధులవంటివి రక్తపోటుకు కారణమవుతాయి. తరుచుగా వంటల్లో నల్ల మిరియాలను వాడటంవల్ల బీపీ సంబంధిత రోగాలు దూరమవుతాయి.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి