లిబియా(Libya)లో మరో కలకలం..
శాంతిభద్రత సమస్యలకు తోడు రాజకీయ అస్థిరతతో అతలాకుతలం అవుతున్న లిబియాలో మరో కలకలం రేగింది. ప్రధాని అబ్దుల్ హమీద్(Abdul Hamid) అల్ దబేజా నివాసంపై నిన్న రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో భవనం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని మంత్రి తెలిపారు. పేలుడుతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రధాని నివాసం వద్ద భారీగా మోహరించాయి. 2011 నుంచి లిబియాలో రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి.
ఇది చదవండి: RR vs DC IPL 2024 : రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం..!
పాలన కూడా రెండు వర్గాల చేతుల్లో ఉంది. 2014లో తూర్పు, పశ్చిమ ప్రాంతాలగా విడిపోయిన వర్గాలు ఎవరికి వారే పాలించుకుంటున్నారు. సమస్యను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఐక్యరాజ్యసమితి 2021లో అబ్దుల్ హమీద్ నేతృత్వంలో నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, తూర్పు ప్రాంతంలోని పార్లమెంట్ ఆయనను అధికారికంగా గుర్తించేందుకు నిరాకరించకపోవడంతో అస్థిరత కొనసాగుతోంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి