చార్జింగ్(charging) 15 నుంచి 20 పాయింట్లు(units) ఉన్న సమయంలోనే మనకు మొబైల్(Mobile) వార్నింగ్ ఇస్తుందని, ఆ సమయంలో తప్పనిసరిగా ఫోన్కు త్వరగా చార్జింగ్ పెట్టుకునే ప్రయత్నం చేయాలని,మొబైల్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అయ్యేంతవరకు వాడితే మాత్రం.. మొబైల్ బ్యాటరీ లైఫ్ టైం చాలా వరకు తగ్గిపోతుందని పేర్కొన్నారు. బ్యాటరీ లైఫ్ టైం నాణ్యతతో పని చేయాలంటే రాత్రి పడుకునే సమయాల్లో, బ్యాటరీ 15 నుంచి 20 పాయింట్ల మీద ఉన్న సమయంలో చార్జింగ్ వినియోగించకపోవడంతో త్వరగా బ్యాటరీపై భారం పడదని, ఫోన్ ఫుల్ చార్జింగ్ అయిన తర్వాత కూడా అలానే ఉంచడం ద్వారా కూడా మొబైల్ బ్యాటరీ లైఫ్ టైం చాలా వరకు తగ్గిపోయిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. మరి ముఖ్యంగా రాత్రి సమయాల్లో చార్జింగ్ పెట్టి ఉదయం వరకు అలానే ఉంచితే బ్యాటరీపై అదనపు భారం పడి త్వరగా బ్యాటరీ ఉబ్బి.. కొత్త మొబైల్ అయినా సరే ఐదు నుంచి మూడు మాసాలలోనే పాడైపోతుందని వివరించారు.
ఇది చదవండి: యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా..!
ఎవరైనా సరే ఉదయం లేచిన వెంటనే చార్జింగ్ పెట్టుకుని మన నిత్యవసర పనులు, ఇంట్లో చేసుకునే సమయం వరకు చార్జింగ్ పెడితే ఫోన్ చార్జింగ్ ఫుల్ అవుతుందని, ఇది మంచి సమయం కూడా అని, ఫోన్ చార్జింగ్ ఫుల్ అయితే మనం చూసుకొని దాన్ని తీసివేయడం జరుగుతుందని తద్వారా బ్యాటరీపై భారం కూడా పడదని సెల్ పాయింట్ నిర్వాహకులు, టెక్నీషియన్ వెంకటేష్ వివరించారు. ఇలా చిన్నచిన్న సలహాలు పాటిస్తే సెల్ ఫోన్ బ్యాటరీ త్వరగా పాడవకుండా రక్షించుకోవచ్చు. సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి కూడా కాల్స్ మాట్లాడడం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ..చాటింగ్ చేయడం కూడా ద్వారా కూడా బ్యాటరీ సామర్థ్యం త్వరగా తగ్గిపోయే అవకాశం ఉందని,అలా చేయడం ప్రమాదం కూడా అని మొబైల్ టెక్నీషియన్స్,మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సంబంధించిన షోరూం నిర్వాహకులు కూడా చెబుతున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి