అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) :
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు హైకోర్టులో షాక్ తగిలింది. తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఆయన ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రికి ఓ న్యాయం… సామాన్యుడికి మరో న్యాయం ఉండదని పేర్కొంది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవని స్పష్టం చేసింది. అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇది చదవండి : తమిళనాడులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు…
కేజ్రీవాల్ అరెస్ట్ నిబంధనల ప్రకారమే జరిగినట్లు హైకోర్టు పేర్కొంది. అతనిని అరెస్టును చట్టవిరుద్ధంగా చెప్పలేమని తెలిపింది. నిందితుడి అరెస్ట్ చట్టప్రకారం జరిగిందా? లేదా? చూడాలని, కానీ ఎన్నికల సమయమని చూడవద్దని పేర్కొంది. అరెస్ట్ చేసే సమయాన్ని ఈడీ నిర్ణయించిందని భావించలేమని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఈడీ తగిన ఆధారాలు కలిగి ఉందని తెలిపింది. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని, నిందితుడి వీలును బట్టి విచారణ ఉండదని పేర్కొంది. కాగా, ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.