భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో నిష్ట నియమాలతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ట్రస్టీ జయరాజు పట్టువస్త్రాలను తయారు చేస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి శ్రీ సీతారాములకు ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు తయారుచేసి కళ్యాణ మహోత్సవానికి అందిస్తున్నారు. సీతమ్మ తల్లికి వివిధ రంగులతో కూడిన రెండు పట్టు చీరలు, రామయ్య తండ్రికి పట్టు పంచెలు, లక్ష్మణ స్వామికి పట్టు పంచలు సమర్పిస్తున్నారు. ఈ ఏడాది కూడా భద్రాచలంలోని శ్రీ భక్త రామదాసు జ్ఞాన మందిరంలో సీతారాములకు చేనేత పట్టు వస్త్రాలు తయారు చేస్తున్నారు. నాలుగు వేల ఎనిమిది వందల పట్టు దారాలతో 2 పట్టు చీరలు 6 పట్టు పంచలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పది రోజుల ముందు భద్రాచలం వచ్చి స్వయంగా స్వామివారి సన్నిధి వద్ద ఈ పట్టు వస్త్రాలు తయారుచేసి సీతారాముల కల్యాణ మహోత్సవానికి అందిస్తున్నారు.
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాల తయారీ..
63
previous post