ఐపీఎల్ 2024 (IPL 2024) :
ఐపీఎల్ 2024 (IPL 2024)లో రాజస్థాన్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లు ముచ్చెమటలు పట్టించడంతో 7 వికెట్లను కోల్పోయిన గుజరాత్.. ఇన్నింగ్స్ చివరి వరకు నిలకడగా ఆడుతూ టార్గెట్‌ను చేధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి మూడు ఓవర్లు చెలరేగి ఆడాడు. కానీ నాలుగో ఓవర్లో ఉమేశ్ యాదవ్ వేసిన బంతికి క్యాచ్ ఔటయ్యాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఐపీఎల్ 2024 (IPL 2024) : మరో ఓపెనర్ జోస్ బట్లర్ విఫలమైనప్పటికీ.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ 38 బంతుల్లో 68 పరుగులు చేశాడు, రియాన్ పరాగ్ 48 బంతుల్లో 76 పరుగుల వేటలో దుమ్ముదులిపేశారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో జట్టుకు కీలక స్కోర్‌ను అందించారు. అయితే వీళ్ల భాగస్వామ్యానికి 19వ ఓవర్లో బ్రేక్ పడింది. 18.4 ఓవర్‌కు మోహిత్ శర్మ వేసిన బంతికి పరాగ్ ఔటయ్యాడు. పరాగ్ ఔటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన హెట్మయిర్ 5 బంతుల్లో 13 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
రాజస్థాన్ నిర్దేశించిన 197 పరుగుల టార్గెట్‌ను చేధించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ దారుణంగా విఫలమయ్యింది. శుభ్‌మన్ గిల్ 72 పరుగులతో ఒక్కడే చెలరేగి ఆడాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ 35తో రాణించాడు. వీళ్లు మినహా మిగిలిన బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ నిలకడగా ఆడుతూ టార్గెట్‌కు దగ్గరగా తీసుకొచ్చారు. చివరి బంతికి రెండు పరుగులు చేస్తే విజయం దక్కే పరిస్థితి నెలకొంది. అలాంటి సమయంలో రషీద్ ఖాన్ ఫోర్ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.