లిక్కర్ స్కామ్ కేసు (Liquor scam case) :
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు (Liquor scam case)లో కవితను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. అయితే కవితను ఐదు రోజుల కస్టడీకి సీబీఐ కోరింది. ఈ సందర్భంగా కోర్టులో కవితపై సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి అని తెలిపింది. విజయ్ నాయర్ తో పాటు పలువురితో కవిత లిక్కర్ స్కామ్ స్కెచ్ వేశారని ఆరోపించింది. ఢిల్లీ, హైదరాబాద్‌లో సమావేశాలు జరిపారని పేర్కొంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం.. ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టమమవుతోందని కోర్టుకు తెలిపింది.
ఇది చదవండి: మూడో దశలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
రూ.100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు కవిత అందించారని తెలిపింది. కవిత సూచనతోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి రూ.25 కోట్లు అందజేశారని పేర్కొంది. వాట్సాప్ చాట్‌లు ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని స్పష్టం చేసింది. వాట్సాప్ చాట్ ను కోర్టుకు అందజేశామని తెలిపింది. బుచ్చిబాబు స్టేట్ మెంట్ ప్రకారం కవితకు.. ఇండో స్పిరిట్ సంస్థలో 33 శాతం వాటా ఉందని తెలిపింది. కవిత పీఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం.. అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు భారీ మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందించినట్టు తెలిపారు. ఈ విషయాలను చార్జిషీట్లలో పొందుపరిచామని సీబీఐ న్యాయవాది తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.