ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) :
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుని విచారించింది… ఇదే కేసులో ఆమెను సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. అయితే కవితను ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చిన సీబీఐ.. కేసుకు సంబంధించి విచారించేందుకు ఆమెను కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. కవిత అరెస్ట్ అక్రమంటూ ఆమె తరుఫు లాయర్లు వాదించగా.. లిక్కర్ స్కామ్ కేసులో కవితనే ప్రధాన సూత్రధారి అని సీబీఐ ఆరోపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి భవేజా ..సీబీఐ వాదనలతో ఏకీభవించారు.
ఇది చదవండి : కవితపై సీబీఐ సంచలన ఆరోపణలు..
ఈ మేరకు కవితను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్వర్వులు ఇచ్చారు. దీంతో ఈ నెల 15వ తేదీ వరకు ఎమ్మెల్సీ కవితను కస్టడీలోకి తీసుకుని సీబీఐ ప్రశ్నించనుంది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితను ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించనున్నారు. కవితను మూడు రోజుల పాటు ఇక్కడే విచారించనున్నారు. కస్టడీ సమయంలో ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను, తన తరుఫు లాయర్లను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతినిచ్చింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: మొన్న ED, నేడు CBI కవిత ఇంక జైల్లోనేనా..?