డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి చేస్తున్న వేళ ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యం అమెరికా(America) మద్దతు ప్రకటించింది. ఇజ్రాయెల్(Israel)పై ఇరాన్(Iran) దాడులకు సంబంధించిన వివరాల కోసం జాతీయ భద్రతా బృందంతో మాట్లాడానని జో బైడెన్(Joe Biden) ప్రకటించారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్, అనుకూల గ్రూపులు చేసే దాడులకు వ్యతిరేకంగా పోరాడుతామని, ఇజ్రాయెల్ భద్రతకు నిబద్ధతతో కట్టుబడి ఉన్నామని జో బైడెన్ హామీ ఇచ్చారు. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు ఇజ్రాయెల్ వైపు ఇరాన్ ప్రయోగించిన డ్రోన్‌లను అమెరికా బలగాలు కూల్చివేస్తున్నాయని ఇజ్రాయెల్ రక్షణ అధికారి ఒకరు తెలిపారు.
ఇది చదవండి: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరో విజయం
ఇజ్రాయెల్‌కు అదనపు రక్షణ అందించడానికి కీలకమైన ప్రాంతాల్లో అమెరికా దళాలు మోహరించి ఉన్నాయని పేర్కొన్నారు. సిరియాలోని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇటీవల దాడి జరిగింది. ఈ ఘటనలో ఇరాన్ రివల్యూషనరీ ఆర్మీకి చెందిన కీలక అధికారి సహా 13 మంది చనిపోయారు. ఇది ఇజ్రాయెల్ పనేనని ప్రకటించిన ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. భారీ సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. ఇది ఆత్మ రక్షణ చర్యగా ఇరాన్ అభివర్ణించింది. కాగా ఇరాన్ ప్రయోగించిన చాలా క్షిపణులను అడ్డుకున్నామని, గాల్లోనే కూల్చివేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.