అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన రిలీజ్ చేసింది. అధ్యక్షుడు స్వల్ప దగ్గు, జలుబుతోపాటు జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం బైడెన్ డెలావేర లోని సముద్రతీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్ లో ఉంటూ కోవిడ్ మందులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వెగాస్ లో ప్రచారంలో ఉన్న బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలడంలో వెంటనే ఆయన ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కోవిడ్ బారిన పడ్డట్లు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపింది. తనకు తీవ్ర అనారోగ్య సమ్యలు తలెత్తితే అధ్యక్ష బరి నుంచి వైదొలుగుతానని బైడెన్ ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. అలా చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే అనారోగ్యానికి గురికావడం గమనార్హం.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభం.మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
- ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హర్మూజ్ జలసంధిని తిరిగి…
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
- చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.ఈ మ్యాచ్ 20వ ఓవర్లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141063