Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home International అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం…

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం…

by Rama
Joe Biden's

ఉగ్రవాద సంస్థ హమాస్‌ను అంతమొందించడానికి గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న యుద్ధకాండతో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు నిరాశ్రయులుగా మారుతున్నారు. ఆహారం సహా కనీస వసతులు లేక విలవిల్లాడుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గాజాలో మానవతా సాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలిపారు. ఇజ్రాయెల్ బలగాల కాల్పుల్లో ఏకంగా 100 మందికి పైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడిన మరోసటి రోజే ఈ ప్రకటన వెలువడింది.

Follow us on : FacebookInstagramYouTube & Google News


త్వరలోనే సహాయక చర్యలు ప్రారంభం కానున్నాయి. అమెరికా మిలిటరీ వాయుమార్గాన ఆహారం సహా ఇతర పదార్థాలను జారవిడచనున్నారు. పాలస్తీనియన్ల వెతలు తగ్గించడమే లక్ష్యంగా యుద్ధంలో దెబ్బతిన్న భూభాగాల్లో అవసరమైన సాయాన్ని అందజేస్తామని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. సాయం అందించేందుకు అదనపు మార్గాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. సముద్రమార్గాన సాయం అందించడంపై కూడా దృష్టిసారించినట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జోర్డాన్‌లోని మిత్రపక్షాలతో కలిసి అదనపు ఆహారం, సామగ్రిని ఎయిర్‌ డ్రాప్‌ చేయనున్నట్టు వివరించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే …
డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా కీలక పోస్ట్‌.
కెనడాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా …
కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.
కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం భారీ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: