మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇండియా కూటమికి భారీ విజయం అందించినందుకు జార్ఖండ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం కోసం కృషిచేసిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్, JMM కార్యకర్తలందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రంలో మహాకూటమి సాధించిన ఈ విజయం రాజ్యాంగంతో పాటు నీరు, అటవీ, భూముల పరిరక్షణకు దక్కిన విజయం అని తెలిపారు. అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు ఊహించలేదని, తాము వాటిని వివరంగా విశ్లేషిస్తామన్నారు. ఇండియా కూటమి విజయం కోసం.. కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 231 స్థానాల్లో విజయం సాధించగా, ఇండియా కూటమి 45 స్థానాల్లో మాత్రమే గెలిచింది. జార్ఖాండ్ లో మాత్రం 81 అసెంబ్లీ స్థానాలకు గాను 56 స్థానాల్లో విజయం సాధించి జె ఎమ్ఎమ్ పార్టీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రకృతి ప్రేమికులతో నిండిపోయిన … తుర్కం చెరువునిర్మల్ జిల్లాలోని పురాతన చెరువైన తుర్కం చెరువు వద్ద ప్రకృతి ప్రేమికుల సందడి నెలకొంది. మామడ మండలంలోని పొనకల్ గ్రామ శివారులో గల తుర్కమ్ చెరువు బర్డ్స్ ఫెస్టివల్ కు వేదిక అయ్యింది. 1913 లో నిర్మించబడిన ఈ…
- డేంజర్ లో హైదరాబాద్ …కొన్ని రోజులుగా వాతావరణంలో మీకు మార్పు గమనించారా . జలుబు ,దగ్గు ,తుమ్ములు వంటి సమస్యలు మీకు ఎదురయ్యాయా ?అసలు ఏం జరుగుతుందో తెలుసా.. మనం ప్రమాదంఅంచుల్లో పడిపోతున్నాం.. వెంటనే అప్రమత్తం అవ్వండి. కాలుష్యానికి బ్రాండ్ గా ఉన్నఢిల్లీ…
- శివనామస్మరణతో మార్మోగుతున్న ద్రాక్షారామంకార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే మహిళలు గోదావరి నదిలో స్థానం ఆచరించి అరటి దొప్పలతో దీపాలు…
- నెరవేరనున్న ఏపీ ప్రజల చిరకాల వాంఛరైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. జోన్…
- విజయవాడ మేయర్ కు పదవీ ముప్పువిజయవాడ నగరపాలక సంస్థలో మేయర్ కు పదవీ ముప్పు తప్పేలా లేదు. ఎన్నికలకు ముందు నగరపాలక సంస్థలో 49 మంది కార్పొరేటర్లతో ఉన్న వైసీపీ బలం ప్రస్తుతం 38కి తగ్గిపోయింది. వీరిలోనూ మరో 10 మందికిపైగా కూటమి పార్టీల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి