దేశ రాజకీయాల్లో నేడు అత్యంత కీలక ఘట్టం..

Advertisements

<p>దేశ రాజకీయాల్లో నేడు అత్యంత కీలక ఘట్టం చోటుచేసుకోబోతోంది&period; లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులపై నేడు ఓటింగ్ జరగనుంది&period; మహిళా రిజర్వేషన్లు&comma; డీలిమిటేషన్ బిల్లులపై సభలో హోరాహోరీ చర్చ సాగుతోంది&period; అయితే రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో&period;&period; కేంద్రానికి అవసరమైన ఆ &&num;8216&semi;మ్యాజిక్ ఫిగర్&&num;8217&semi; అందుతుందా&quest; విపక్షాల మద్దతు లేకుండా ఈ బిల్లులు గట్టెక్కడం సాధ్యమేనా&quest; అసలు లోక్‌సభలో బలాబలాలు ఎలా ఉన్నాయి&quest; దీనిపై సీవీఆర్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్&period;&period;<&sol;p>&NewLine;<p>ఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి&period; గురువారం కేంద్రం లోక్‌సభలో మూడు సంచలన బిల్లులను ప్రవేశపెట్టింది&period; డీలిమిటేషన్ బిల్లు&comma; కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు&comma; రాజ్యాంగ సవరణ బిల్లు&&num;8230&semi;&period; మహిళా కోటాపై పార్టీలన్నీ సానుకూలంగా ఉన్నా&period;&period; డీలిమిటేషన్ అంశంపై మాత్రం అధికార&comma; ప్రతిపక్షాల మధ్య యుద్ధం నడుస్తోంది&period; నేడు లోక్‌సభలో ఈ బిల్లులపై ఓటింగ్ జరగనుండగా&period;&period; శనివారం రాజ్యసభ ముందుకు ఇవి వెళ్లనున్నాయి&period; అయితే ఇప్పుడు అందరి దృష్టి లోక్‌సభలోని &&num;8216&semi;నెంబర్ గేమ్&&num;8217&semi; పైనే ఉంది&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతం లోక్‌ సభలో మొత్తం 540 ఉన్నారు&period; అయితే&comma; ప్రస్తుత బిల్లుకు రాజ్యాంగ సవరణ జరగాలంటే&&num;8230&semi; అందుకు కావాల్సిన 2&sol;3 మెజార్టీ అంటే 360 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది&period; సభలో NDA కూటమిలో&&num;8230&semi; బీజేపీకి 240 మంది సభ్యులు ఉన్నారు&period; అలాగే&comma; టీడీపీ 16 మంది&&num;8230&semi;&period; జేడీయూ 12 మంది&&num;8230&semi;&period; వీరందరితో కలిసి మొత్తం ఎంపీల సంఖ్య 293 ఉంటుంది&period; ఇక&comma; విపక్షం INDIA కూటమి బలంగా ఇలా ఉంది&&num;8230&semi;&period; కాంగ్రెస్ కు 98 మంది ఎంపీలు ఉన్నారు&period; సమాజ్‌వాదీ పార్టీ 37 మంది&&num;8230&semi;&period; టీఎంసీ 28 మంది&&num;8230&semi; డీఎంకే 22 మంది ఎంపీలు ఉన్నారు&period; ఇండియా కూటమి మొత్తం బలం 233 మంది సభ్యులు&period;&period; ఇక&comma; ఇతరులు అంటే&&num;8230&semi; వైసీపీ&comma; ఎంఐఎం&comma; స్వతంత్రులు సభలో 14 మంది ఎంపీలు ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p>రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గాలంటే సభలో ఉన్న సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది మద్దతు తప్పనిసరి&period; అంటే 540 మంది హాజరైతే 360 మంది ఓట్లు కావాలి&period; కానీ ఎన్డీయేకు ఉన్నది కేవలం 293 మంది మాత్రమే&period; అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 67 మంది తక్కువ&period; విపక్షాల మద్దతు లేకుండా ఈ బిల్లు పాస్ అవ్వడం అసాధ్యం&period; ఒకవేళ ప్రతిపక్ష సభ్యులు గైర్హాజరైతే మ్యాజిక్ ఫిగర్ తగ్గే అవకాశం ఉంది&period; ఉదాహరణకు 20 మంది సభ్యులు సభకు రాకుంటే&period;&period; మెజార్టీ మార్కు 347కు తగ్గుతుంది&period; ఎస్పీ&comma; టీఎంసీ&comma; డీఎంకే వంటి పార్టీల్లో ఏవైనా రెండు పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉంటేనే కేంద్రానికి ఊరట లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు రాజ్యసభలో మాత్రం కేంద్రానికి పెద్దగా ఇబ్బందులు లేవు&period; అక్కడ 163 మంది మద్దతు అవసరం కాగా&period;&period; ఎన్డీయేకు 141 మంది బలం ఉంది&period; వైసీపీ&comma; బీజేడీ&comma; బీఆర్ఎస్ వంటి పార్టీల మద్దతుతో అక్కడ నెగ్గడం సులభమే&period; కానీ ముందు లోక్‌సభ గండం గడవాలి&period; బిల్లును నెగ్గించుకోవడానికి సరిపడా సంఖ్యా బలం లేదని సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీలే అంగీకరిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది&period; ఇక&comma; కేంద్ర ప్రభుత్వం ఈ చదరంగంలో పైచేయి సాధిస్తుందా&quest; లేక విపక్షాలు బిల్లును అడ్డుకుంటాయా&quest; మరికొద్ది గంటల్లోనే పార్లమెంట్‌లో క్లారిటీ రానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.