నిస్వార్థ సేవలకు మారు పేరు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అని కొనియాడారు రాజమండ్రి వాస్తవ్యులు, ఆంధ్రా యూనివర్సిటీ యోగా సర్టిఫికేట్ హోల్డర్, యోగా సామ్రాట్ తోడ రాము. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ప్రతిభా జూనియర్ కళాశాలలో మానవత నెలవారీ సమావేశం అధ్యక్షులు చింతంరెడ్డి వెంకట్రామి రెడ్డి, చైర్మన్ అరమాటి శివగంగి రెడ్డి ల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం కు రాజమండ్రి వాస్తవ్యులు ఆంధ్రా యూనివర్సిటీ యోగా సర్టిఫికేట్ హోల్డర్, యోగా సామ్రాట్ తొడ రాము తో పాటు విశ్రాంత యం ఈ వో రెడ్డన్న, ఇందిరా డిగ్రీ కళాశాల, వైవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ జయ ప్రకాష్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు అనతి కాలంలో ప్రజల ఆదరాభిమానాలు పొందిన సంస్థ మానవత సంస్థ. మనిషి మృతి చెందిన, స్మశాన వాటిక తీసుకువెళ్ళడానికి కాని, జబ్బు వస్టే వైద్యం కోసం సహాయం చేయడానికి ఎవ్వరు కూడా ముందుకు రారు. కానీ అటువంటి సమస్యలకు పరిష్కారం కోసం పురుడు పోసుకొని పుట్టిన సంస్థే మానవత అని సగర్వంగా చెప్పవచ్చన్నారు. వయో పరిమితి, సమయం తో సంబంధం లేకుండా ఎటువంటి ప్రతి ఫలం ఆశించకుండా అందరి సహకారంతో ప్రజలకు అవసరమయ్యే సేవలను అందించుచుండడం చాలా అభినందనీయమం అని అన్నారు. మానవత సంస్థ ఆర్థికంగా పలు రకాల సేవలు అందించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్బంగా వారు తెలియజేశారు. అతిథులుగా హాజరైన వారిని మానవత సంస్థ సభ్యులు శాలువాలతో సత్కరించి మానవతా మెమొంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవత ఉపాధ్యక్షులు సంచుల ఖాదర్ బాషా, సెక్రెటరీ వెంకటరమణ నాయుడు, ట్రెజరర్ రెడ్డప్ప రెడ్డి, మానవత మాజీ అధ్యక్షులు వెంకటేష్, కనపర్తి శివ శంకర్ రెడ్డి, కో చైర్మన్ షకీల్, జిల్లా కమిటీ సభ్యులు ఆనంద రెడ్డి, గౌరవ సలహాదారులు వెంకట రమణ, సభ్యులు శ్రీధర్ రెడ్డి, రవి శంకర్ రెడ్డి, మురళి మోహన్ రెడ్డి, అర్ వి రాజు తదితర మానవత కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
మానవత స్వచ్ఛంద సేవా సంస్థ..
120
previous post