72
చిత్తూరు జిల్లా కుప్పంలో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కుప్పం నుండి చెన్నై వెళ్లే రైల్వే ట్రాక్ పై ఉదయం ఎనిమిది గంటలకు కుప్పం కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ గుడి ఎదురుగా. బెంగళూరు నుండి చెన్నై వెళ్లే లాల్బాగ్ ట్రైన్ కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది. విషయం తెలుసుకున్న కుప్పం రైల్వే పోలీస్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆ ఏరియా ఆసుపత్రికి తరలించారు.