నగర ప్రజలంతా తన కుటుంబ సభ్యులనీ… కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆదరణ, ఆశీసులు మెండుగా ఉన్నందునే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాను ఘన విజయం సాధించానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జెఎన్ రోడ్డులోని చెరుకూరి కన్వెన్షన్ హాల్లో గురువారం ఎన్డీయే కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. జగన్ పాలనలో ఐదేళ్ల పాటు మనమంతా చాలా ఇబ్బందులు పడ్డామని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. అధికార దురంహంకారంతో తనకు అసలు టిక్కెట్టే రాదని, రాజకీయాల్లో లేకుండా చేస్తామన్న ఒక వ్యక్తి ఇప్పుడు అసలు కనిపించకుండానే పోయాడన్నారు. నగరంలో ఐదేళ్ల పాటు పారిశుద్ధ్యాన్ని పక్కన పెట్టేశారని, అధికార దుర్వినియోగం చేస్తూ అనాలోచితంగా చేసిన పనులు కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, వాటన్నింటినీ సరి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి పని చేయాలి అని అధికారులకు సూచించామన్నారు. మాట వినని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ అధికారైనా మాట వినకపోతే తన దృష్టికి తీసుకువస్తే ఆ పని చేయించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఆరోగ్యకర రాజమండ్రి కోసం కృషి చేస్తున్నామన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.