తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ముఖ్యఅతిథిగా విచ్చేసి బ్యాగులు, పుస్తకాలు సంబంధిత స్కూల్ కిట్స్ ను విద్యార్థులకు అందజేశారు.అనంతరం కళాశాల ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెంట్రల్ ప్రెసిడెంట్ బొల్లా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లక్ష రూపాయలతో నూతనంగా నిర్మించబడిన స్టేజ్ ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు,ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లితండ్రులను, ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని చిన్నతనం నుండి క్రమశిక్షణను అలవర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా కృషి చేయాలని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానములో ఉండేందుకు పాఠశాల విద్య ఎంతో తోడ్పాటు నిస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలలో లేనన్ని సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.