ధర్మవరంలో ఐదేళ్ల పాటు విచ్చలవిడిగా కబ్జాలు, ఆక్రమణలు చేశారని.. వీటిన్నింటికీ ఇప్పుడు లెక్క చెప్పాల్సి ఉంటుందని టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. ధర్మవరం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల స్థితిగతులను ఆయన స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ తో కలసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. 28 వ వార్డులో వాటర్ ట్యాంక్, సిద్దయ్యగుట్టలోని సాయిబాబా వాటర్ ట్యాంక్, ఎల్.పి.సర్కిల్లోని అన్న క్యాంటీన్, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ను పరిశీలించారు. అమృత్ స్కీమ్ కింద మంజూరైన పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడంపై శ్రీరామ్ ఆరా తీశారు. వెంటనే పనులు మొదలు పెట్టేలా చూడాలని అధికారులను కోరారు. అలాగే ఐదేళ్లుగా మూతపడ్డ అన్న క్యాంటీన్ల పరిస్థితిని స్వయంగా చూశారు. వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. ఈసందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, అభివృద్ధి పనులు ఎక్కడ ఆగిపోయాయి ఇలాంటి అంశాలు తెలుసుకునేందుకు వచ్చానన్నారు. అలాగే పేద ప్రజలకు తక్కువ ధరకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పై కక్షతో ప్రజలకు పెట్టే భోజనాన్ని దూరం చేశారన్నారు. త్వరలోనే అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. అలాగే వార్డుల వారిగా సమస్యలు ఏమున్నాయి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న దానిపై ఒక సమీక్ష చేసుకుని మంత్రి సత్యకుమార్ సహకారంతో వాటన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. మరోవైపు తాము ఎక్కడ అభివృద్ధి చేస్తామోనన్న భయంతో వైసీపీ నాయకులు వారి పత్రిక ద్వారా విషం చిమ్మిస్తున్నారన్నారు. ఐదేళ్ల పాటు మున్సిపల్ స్థలాలు కబ్జా చేసి, ఎక్కడికక్కడ ఆక్రమణలు చేసిన వారిని ఊరికే వదిలేదిలేదన్నారు. వాటిన్నింటిపై చర్యలు ఉంటాయన్నారు. ఇన్ని రోజులు స్వైర విహారం చేసి.. ఇప్పుడు కూడా అలాగే ఉంటామంటే.. ఊరుకునేది లేదన్నారు. ఆరోజు ధర్మవరంలో ప్రశాంతత కోసం పరిటాల రవి కృషి చేశారని.. ఇప్పుడు కూడా తాము ప్రశాంతత కోసం పని చేస్తామన్నారు. వైసీపీ నాయకులు వారి హద్దుల్లో ఉంటే బాగుంటుందని.. అలా కాదంటే మా నుంచి ప్రతి సమాధానం కూడా ఉంటుందని హెచ్చరించారు…..
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- సీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ..అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అదానీ తనను మర్యాదపూర్వకంగా కలిశారని తెలిపారు. ఈ క్రమంలోనే…
- కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..మూసీ సుందరీకరణ ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు అధికారులతో కలిసి సచివాలయం వేదికగా మూసీపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారు. మొత్తం 33 బృందాలు…
- పోలీసుల విచారణకు సజ్జల గైర్హాజరు( ) వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని అందులో వివరించారు. ఈ రోజు ఉదయం 10.30…
- ఈనెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ..తెలంగాణ మంత్రి మండలి సమావేశానికి తేదీ ఖరారైంది. ఈనెల 23వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరుగనుంది. హైడ్రాకు చట్టబద్ధత, అసెంబ్లీ సమావేశాల…
- కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క..బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి 10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు మంత్రి సీతక్క ట్విటర్ వేదికగానే కౌంటర్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.