శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి 20వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు 2 గంటలపాటు సమావేశం కొనసాగింది అనంతరం ఆలయ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ 52 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 51 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 1 వాయిదా వేశామన్నారు. ఈ ట్రస్ట్ బోర్డ్ సమావేశంలో ఈనెల 14 న నుండి ప్రారంభం కానున్న కార్తీక మాసోత్సవాలుకు భక్తుల కల్పించే ఏర్పాట్లపై చర్చించామన్నారు. ముఖ్యంగా క్షేత్ర పరిధిలో రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడకూడదని గతంలో ఉన్న జిఓని మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు. క్షేత్రంలో సోలార్ విద్యుత్ కోసం 7 కోట్లు అలానే భక్తులకు డార్మెంటరీ కోసం 23 కోట్లకు ఆమోదించమని క్షేత్రంలో రోడ్లకు 30 కోట్లతో పాటు నూతనంగా 60 కోట్లతో 200 రూములు నిర్మించాలని ఆమోదించామన్నారు. అలానే శ్రీశైలం క్షేత్రంలో ఎటువంటి అన్యమత ప్రచారాం జరగడం లేదని క్షేత్రంలో ధర్నాలు,నిరసనలు చేయకూడదన్నారు. గతంలో ప్రవేశపెట్టిన ఉదయాస్తమాన సేవను రద్దు చేశామని ఆసేవ స్థానంలో ప్రాతకాలసేవ పెట్టామని కమిషనర్ ఉత్తర్వులు వస్తే త్వరలో భక్తులకు ఈసేవ అందుబాటులోకి తెస్తామని ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు.
శ్రీశైలం ఆలయ 20వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం..
98
previous post