శ్రీశైలం పుణ్యక్షేత్రం లో మరోసారి చిరుత సంచారం కలకలం రేగింది. పాతాళగంగ మార్గంలో సంచరించిన చిరుత.. ఏకంగా దేవాలయం ఈవో ఇంటి ప్రహరీ గోడ పై నడుచుకుంటూ వెళ్ళింది. అనంతరం అక్కడే ఉన్న కుక్కపై దాడి చేసి దాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన సంఘటన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీశైలంలో చిరుత సంచారం. అయితే ప్రస్తుతం డ్యాం గేట్లు ఎత్తడంతో భారీగా సందర్శకులు, భక్తులు శ్రీశైలానికి పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో అటవీ మార్గంలోని ప్రధాన రహదారిపై అటవీ, పోలీస్ అధికారులు భారీ గస్తీ కాస్తున్నారు. ఈ క్రమంలో చిరత ఏకంగా పాతాళగంగ మార్గంలో దర్శనమివ్వడం ఆందోళనకర విషయమని అంటున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి చిరుత ఆనవాళ్లను పసిగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్ మెట్రో రెండోదశకు కేంద్రం అంగీకారం…హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. నగరాభివృద్ధి,…
- సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ ప్లేఆఫ్ రేస్‌లోకి తిరిగి..సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ ప్లేఆఫ్ రేస్‌లోకి తిరిగి.. ఈ సీజన్లో జైపూర్‌లో వచ్చిన మొదటి విజయం రాజస్థాన్ రాయల్స్‌కు (Royals) అత్యంత సరైన సమయంలో వచ్చింది. వరుసగా 3 పరాజయాల తర్వాత వారు తిరిగి పుంజుకుని, ప్లేఆఫ్స్ స్థానం…
- రమణి కళ్యాణం ట్రైలర్.. పక్కా ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ ..ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో రమణీ కళ్యాణం మంచి ఫీల్‌గుడ్…
- భారీ సర్ప్రైజ్ తో ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ తెలుగు ట్రైలర్ – హీ-మ్యాన్‌గా నిఖిల్ సిద్ధార్థ వాయిస్ …హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ తెలుగు…
- ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది.ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది. ఆయనను పాములు ఆడించే వాడిగా చిత్రీకరించింది. తమ జాత్యహంకారాన్ని అలా నిరూపించుకుంది. నార్వేకు చెందిన ఆఫెన్ పోస్టెన్ అనే పత్రిక వేసిన ఆ కార్టూన్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు ఆస్కారం ఇచ్చింది. దీనికి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి







Total views : 81445