శ్రీశైలం టోల్గేట్ చెకింగ్ పాయింట్ వద్ద అర్ధరాత్రి చిరుతపులి సంచారం కలకలం రేపింది.అటవీప్రాంతంలో నుండి చిరుతపులి బయటకు వచ్చి టోల్గేట్ చెకింగ్ పాయింట్ వద్ద చిరుత పులి కుక్కను చంపి అటవీలోకి తీసుకెళ్లింది. దర్శనార్థం భక్తులు వెళ్లే మార్గంలోని రోడ్డుపై చిరుత పులి కుక్కని చంపి తీసుకెళ్లడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో అటుగా వెళుతున్న కొందరు భక్తులు తమ వాహనాలలో కూర్చొని కారు లైట్లు చిరుతపులి ఉన్న వైపు వేసి తమ సెల్ ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. వీడియో తీస్తున్న క్రమంలో భక్తుల అరుపులు శబ్దం మిన్న చిరుత పులి గోడ పైనుండి కిందకు దూకి పక్కనే ఉన్న అటవీప్రాంతంలోకి వెళ్లిపోయింది. రాత్రి సమయం కావడంతో భక్తులు ఎవరు అటువైపు వెళ్లకపోవడం పైగా చీకటిగా ఉండటంతో చిరుతపులి బయటకు వచ్చినట్లు భావిస్తున్నారు. చిరుత పులి సంచారం గురించి శ్రీశైలం అటవీశాఖ రేంజర్ నరసింహులుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించి హుటాహుటిన అటవీశాఖ సిబ్బందిని అలర్ట్ చేశారు..
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం భారీ దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్‌లు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.…
- అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. H-1B వీసాపై లక్షా 3 వేల డాలర్ల వరకు ఫీజు విధించే ప్రతిపాదనలను తీసుకొచ్చింది. కోర్టులు గతంలో కొన్ని చర్యలను అడ్డుకున్నప్పటికీ, వీసా విధానాల్లో కఠిన మార్పుల…
- శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.శ్రీరంగపట్నంలోని ఆరతి ఉక్కడ ఆలయంలో ఎమ్మెల్యే కుమార్తె, పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ మధ్య ఘర్షణ సంచలనంగా మారింది. మహిళా పీఎస్‌ఐ, ఎమ్మెల్యే కుమార్తె ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. భీమ అమావాస్య వేడుకల సందర్భంగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించే విషయంలో…
- ‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి.‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ: ఇరుముడి బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్‌లో మాస్ మహారాజా రవితేజ మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ…
- AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి