Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

by Rama
అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న, దాచిన 18.5 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని చింతలపాలెం మండలంలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎన్టీఆర్‌ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన జగన్నాథం శ్రీనివాసరావు చింతలపాలెం మండలం దొండపాడులో మూడు క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి ప్యాసింజర్‌ ఆటోలో ఎన్టీఆర్‌ కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కునికిపాడుకి చెందిన బండారుపల్లి రామాంజనేయులుకు పంపుతుండగా.. చింతలపాలెం మండలం దొండపాడులోని బొమ్మల సెంటర్‌ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఎన్టీఆర్‌ కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కునికిపాడులోని రామాంజనేయులుకు చెందిన కోళ్ల ఫాంని సోదా చేయగా సుమారు 12.5 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం లభించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
  • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
    అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
  • అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
  • భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.
    భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

039261
Total views : 195174

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: