శ్రీశైలం దేవస్థానం పరిధిలోని యాఫి ధియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది యాఫి ధియేటర్ సమీపంలో దేవస్థానం నూతనంగా సీసీ రోడ్డు,సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసిబితో శివలింగం బయటపడిన పరిసరాలను చదును చేస్తుండగా పురాతన ఓ శివలింగం బయటపడింది. శివలింగంతో పాటు అదే రాయిపై నందీశ్వరుడి విగ్రహం బయటపడింది బయటపడిన శివలింగం పక్కనే తెలియని లిపితో రాసి ఉన్న శాసనం గుర్తులు కూడా ఉన్నాయి సీసీ రోడ్డు,సపోర్ట్ వాల్ నిర్మాణం పనులు చేస్తుండగా శివలింగం బయటపడటంతో పనులు చేస్తున్న వ్యక్తులు దేవస్థానం అధికారులకు సమాచారం తెలపడంతో బయటపడిన పురాతన శివలింగాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు శివలింగం పక్కనే ఉన్న శాసన లిపిని ఫోటోలు తీసి మైసూర్ ఆర్కియాలజీకి డిపార్ట్మెంట్ కు దేవస్థానం అధికారులు పంపించారు బయట పడిన పురాతన శివలింగం వద్ద ఉన్న శాసన లిపి 14,15 వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా గుర్తించారు బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని చక్ర గుండం వద్ద సారంగధార మఠం రుద్రాక్ష మఠం మధ్యలో శివలింగాన్ని నందీశ్వరుడిని ప్రతిష్టించినట్లు లిపిలో నమోదు చేసివుందని మైసూరుకు చెందిన ఆర్కియాలజీ సర్వ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం ద్వారా లిపిలో ఉన్న సమాచారం గుర్తించారు అయితే ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖ లింగం కూడా బయటపడింది అలానే గతంలో క్షేత్రంలోని పంచమఠాల పునర్నిర్మాణ సమయంలో కూడా పలు తామ్ర శాసనాలు బంగారు,వెండి నాణేలు కూడా బయటపడ్డాయి ఇప్పుడు అదే రీతిలో పురాతన శివలింగం బయటపడటం గొప్ప విశేషంగా భక్తులు దేవస్థానం అధికారులు భావిస్తున్నారు……..
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని, అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉబెర్ సంస్థకు సూచించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉబెర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్…
- ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..ఆంధ్రప్రదేశ్‌లో తయారీ రంగం దూసుకెళుతోందని, ‘మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనేది ఇప్పుడు నాణ్యతకు, నమ్మకానికి చిహ్నంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తయారీ రంగం పురోగతిని వివరిస్తూ ఆయన బుధవారం సోషల్…
- ఉప్పల్ ఆర్క గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రూల్స్ ఉల్లంఘన..విద్య వ్యాపారంగా మారింది. పిల్లల చదువులను పెట్టుబడిగా చేసుకుని కోట్లు సంపాదిస్తున్నాయి విద్యాసంస్థలు. ఇంటర్నేషనల్, గ్లోబల్ అని బోర్డులు తగిలించుకుని… తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. ఉప్పల్ పీర్జాదీగూడలోని ఆర్కా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ సంగతి సరిగ్గా ఇదే. పేరుకు ఇంటర్నేషనల్ స్కూలే…
- అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో అమాయక ప్రజలను మభ్యపెడుతూ.. వీఎంఆర్‌డీఏ, పంచాయతీ అనుమతులు లేని అక్రమ లేఅవుట్లతో కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారు. పెదరాంబద్రపురం, నామవరం పరిధిలోని పలు సర్వే నంబర్లలో…
- నీట్ లీక్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో బయటికొస్తున్నాయి. రాజస్థాన్ నుంచి గురుగ్రామ్, నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా, సీబీఐ విచారణతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 75353