పలాస లో సామాజిక సాధికారిక యాత్ర లో మంత్రి ధర్మాన ప్రసాదరావు కామెంట్స్ గతం లో చిన్న చిన్న మార్పులకు ఉద్యమాలు చేసే వాళ్ళం.నాలుగున్నర సంవత్సారాలు బిన్నం గా పాలన జరిగింది. కిడ్నీ డిసీజ్ పై గతం లో చూసి వెళ్ళే వారు తప్ప దానికి పరిష్కారం చూపలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక పరిష్కారం చూపి శుద్ధ జలాలు పై అడుగులు వేసాం. 700 కోట్లతో త్రాగు నీరు ప్రాజెక్ట్ నిర్మించాం, 200 పడకల ఆసుపత్రిని నిర్మించాం. గతంలో అవినీతి అనేది చాలా ఎక్కువగా ఉంది. డి బి టి ద్వారా డైరెక్ట్ గా లబ్ధిదారులకు ఇచ్చి అవినీతి అరికట్టడం జరిగింది. చంద్రబాబు కూడా మేము అరికట్టిన అవినీతి పై మాట్లాడలేక పోయారు. అందుకే చంద్రబాబు నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అంటున్నారే తప్ప అవినీతి అని చెప్పలేదు. ఆఖరుకి ఆయన కూడా ఇదే తరహా లో నిధులు పంచుతామని అన్నారంటే జగన్ లాగా బాబు ఆలోచన చేయలేకపోయారు. ప్రజల జీవన ప్రమాణాలు లు పెంచడానికి ఆయన ఆలోచించలేదు. డబ్బున్న వారి కోసం వారి నీ ఎలా మరింత పెద్దలుగా పెంచాలని ఆలోచించరే తప్ప పేదల కోసం ఏమి చేయలేదు సమాజంలో ప్రజల ప్రమాణాలు పెంచడమే లక్ష్యం తో మేము వెళుతున్నాం రోడ్లు ఉంటే నే అభివృధి అనుకోవడం తప్పు ఓక ఇంటి వారు అభివృధి చెందందంటే కారణం విద్య, వైద్యం, సొంత ఇళ్లు ఉంటే అది అభివృధి ఇల్లు లేని ప్రతి వాళ్ళకి ఇల్లు ఇచ్చాము చంద్రబాబు ఇటువంటి ఆలోచించలేదు చంద్రబాబు ఎంతసేపు రాజధాని అనుకున్నాడు. అతనికి కావలసిన ప్లేస్ లో రాజధాని మాత్రమే పెట్టుకున్నాడు. తన కావాల్సిన వాళ్ళతో రాజధాని పక్కనే భూములు కొనిపించుకున్నాడు. 2014 లో 23 సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో రెండు సంస్థలు రావాలి అందులో యూనివర్సిటీ, రీసెర్చ్ సెంటర్ గానీ రావాలి. ఒక్కటి కూడా రాలేదు ఆయన శ్రీకాకుళం అంటే ప్రేమంటారు ఎక్కడ ప్రేమ. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం చేశారు శ్రీకాకుళం ప్రాతం లో ఎన్నోసార్లు గెలిపించారు ఏమి చేయలేదు బాబు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలని చూస్తున్నారని ఇప్పుడు అంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు ఏమి చేసావు బాబు. ఇప్పుడు మోసపు మాటలు మాట్లాడుతున్నారు. 4,700 కోట్లతో మూలపెట లో పోర్ట్ వస్తోంది. ఈ ప్రాంతం అంటే జగన్ కు ప్రేమ. జగన్ సైకో అతను వస్తే ఇక్కడ దోపిడీ అంటున్నారు. మనం చూస్తున్నాం పాలన ఎలా ఉందో అర్థం చేసుకోండి. యువత ముఖ్యం గా వినాలి మనం ఏమి చేస్తున్నామో అందరికీ చెప్పాలి.
సాధికారిక యాత్ర లో ప్రసాదరావు కామెంట్స్..
132