విశాఖ ఫిషింగ్ హర్బర్ అగ్నిప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక మత్స్యకారులు వాసుపల్లి నాని, అతని మామ సత్యమే ఈ ప్రమాదానికి కారణమన్నారు సీపీ రవి శంకర్. వీరిద్దరూ అల్లిపల్లి వేంకటేశ్ చెందిన 887 బోటులో మద్యం తాగారని పేర్కొన్నారు. అనంతరం సిగరెట్ కాల్చి పక్కనే ఉన్న 815 నెంబర్ బోటులో వేశారని అన్నారు. మంటలు బాగా వ్యాపించడంతో ఇద్దరు అక్కడ నుంచి పరారయ్యారని తెలిపారు. ఈ ఇద్దరిపై ఐపిసి సెక్షన్ 437,438,285 కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసు అనుమనితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారని సిపి తెలిపారు. విచారణలో భాగంగానే యూట్యాబర్ నానిని తీసుకొచ్చామన్నారు. విచారణలో అతని ప్రమేయం లేదంటే తాము ప్రోసిజర్ ప్రకారం విడిచి పెట్టే వాళ్ళమన్నారు. ఈ కేసుకు సంభందించి 50 కు ఫైగా సిసి కెమెరాలను పరిశీలించామని తెలిపారు. నిందితులు సిగరేట్ విసిరివేయ్యడంతో వలలకు నిప్పు అంటుకుందని ఆ సమయంలో గాలులు కూడా బాగా వీయడంతో మంటలు త్వరగా వ్యాపించాయని వివరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కమాండ్ కంట్రోల్ ద్వారా హార్బర్ మోనటరింగ్ చేస్తామని సీపీ రవి శంకర్ తెలిపారు
ఫిషింగ్ హార్బర్ కేసులో కీలక మలుపు..!
187
previous post