శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి నవ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓడి చెరువు మండలం ఎం కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభోగంగా, ఎంతో భక్తిశ్రద్ధలతో, స్వామి వారి రథోత్సవాన్ని అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు ఊరేగించారు. రాష్ట్రంలో శ్రీ మణికంఠ స్వామి రథోత్సవం ఎక్కడ లేకపోవడం విశేషం కాగా.. ఓడి చెరువు మండలంలో గత ఐదు సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి రథోత్సవాన్ని ఊరేగింపుగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఎం కొత్తపల్లి బండపై నుంచి స్వామివారి రథోత్సవాన్ని వేలాదిమంది అయ్యప్ప స్వామి భక్తులు ఓడి చెరువు పురవీధుల్లో అత్యంత వైభవంగా కన్నుల పండుగ గా నిర్వహించారు. శ్రీ మణికంఠుడు, వేలాయుధుడు, అయిన స్వామి వారు, స్వామికి అత్యంత ఇష్టమైన పులి వాహనంపై ఆశీనులు కాగా వేలాదిమంది అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు పారవశ్యంతో.. స్వామివారి రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు. పురవీధులలో ఎక్కడ చూసినా అయ్యప్పస్వామి నామస్మరణతో మారుమోగాయి. ముఖ్యంగా మహిళలు, పురవీధులలో ప్రధాన రహదారులపై స్వామివారి రథం ముందు పవిత్ర గంగ నీరు పోసి రథాన్ని లాగడానికి సహకరించారు. ఓడి చెరువు మండలంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. ఎం కొత్తపల్లి నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు స్వామివారి రథాన్ని లాగుతూ అయ్యప్ప స్వామి భక్తులు పులకరించి పోయారు. స్వామివారికి నైవేద్యంగా చక్ర పొంగలి, టెంకాయలు పూలు సమర్పించుకుని మహిళా భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. గురు స్వామి అయిన పచ్చర్ల ఆంజనేయులు నాయుడు ఈ ఏడు పంటలు బాగా పండి సకాలంలో వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశీర్వచనాలు అందజేశారు.
Read Also..