తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని కన్నవరం గ్రామంలో సోమవారం నాడు ఒకేరోజు మూడు గ్రావెల్ క్వారీ లు ప్రారంభించడంతో ఒక్కసారిగా 200 నుండి 300 టిప్పర్లు గ్రావెల్ క్వారీ మట్టితో తమిళనాడుకి తరలిస్తూ ఉన్నారు తద్వారా కన్నవరం , రాజుగుంట రాజుల కండ్రిగ మార్గం పూర్తిగా దెబ్బతిని పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ప్రయాణం చేయవలసి వస్తుందని గ్రామస్తులు ఆవేశానికి గురై కన్నవరం గ్రామంలోని గ్రావెల్ క్వారీలు మార్గం వద్ద ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువత మీడియాతో మాట్లాడుతూ మా కన్నవరం గ్రామంలో స్థానిక వైసీపీ నాయకుల అండదండలతో నడుపుతున్నటువంటి గ్రావెల్ క్వారీ యజమానులు వెంటనే నిలిపివేయాలని లేనిపక్షంలో క్వారీ నిలిపేంతవరకు నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామంటూ మీడియా ద్వారా హెచ్చరించారు.కొందరు యువకులు టిప్పర్లు క్వారీలకు వెళ్లకుండా వెనక్కి తిరిగి పంపించేశారు.ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మా గ్రామంలో క్వారీలు నడపకుండా ఉండేందుకు అనుమతులు ఇవ్వకుండా మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా మరి మరి కోరుతున్నామని వారు వాపోయారు.
ఆందోళనకు దిగిన యువత ఖాళీగా వెలుగిరిగిన టిప్పర్లు..
48
previous post