చిత్తూరు జిల్లా…పూతలపట్టు.గుండ్లపల్లి ఎంపీటీసీ సభ్యుడి తల్లిదండ్రులపై ఎమ్మెల్యే అనుచరుల దాడి… పూతలపట్టు ఎమ్మెల్యే చర్యలు మితిమీరుతున్నాయి…ఈ గూండా ఎమ్మెల్యే మాకు వద్దు.. జగనన్నే ముద్దు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో కలిసి నడవడానికి మేము రెడీ…శ్రీ సంక్షేమ శాఖ రాయలసీమ జోన్ చైర్మన్ శైలజ చరణ్ రెడ్డి.. పూతలపట్టు నియోజకవర్గం లో గ్రూప్ రాజకీయాలు… గ్రూపు రాజకీయాలతో ఈసారి ఎమ్మెల్యే సీటు టిడిపి కైవసం చేసుకొవచ్చు అంటూ ప్రచారం… 2019 ఎన్నికలలో పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఏంఎస్ బాబు గెలిచారు. ఫ్యాను గాలితో రాష్ట్రవ్యాప్తంగా 150 కి పైగా సీట్లు కైవసం చేసుకున్న వైసిపి ప్రజలకు ఏమీ చేయ లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అనేక నియోజకవర్గాలలో వైసిపి నాయకులలోనే గ్రూపు తగాదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే పూతలపట్టు నియోజకవర్గం లో ఎమ్మెల్యే ఏంఎస్ బాబు చర్యలతో మూడు నాలుగు గ్రూపులుగా వైసిపి నాయకులు విడిపోతున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు చర్యలు రాను రాను మితిమీరిపోతున్నాయని సాక్షాత్తు జిల్లాలోని రాష్ట్ర శ్రీ, శిశు సంక్షేమ శాఖ రాయలసీమ జోనల్ చైర్మన్ శైలజ చరణ్ రెడ్డి తో వైరం ముదిరింది.దీంతో పూతలపట్టు వైసీపీలోనే రెండు మూడు వర్గాలుగా విడిపోయారు.శైలజ చరణ్ రెడ్డి తో వైరం చిలికి చిలికి గాలి వానలా తయారవుతుంది. పూతలపట్టు ఎమ్మెల్యే ఏంఎస్ బాబు పనితీరు తమకు నచ్చక వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైఎస్ఆర్ సీపీ తరఫున టికెట్ ఇవ్వవద్దని స్వయంగా జిల్లాలోని పెద్దాయనగా పేరున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వివరించారు పూతలపట్టు లోని వైసిపి సీనియర్ నాయకులు పూతలపట్టు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్రనాయకత్వానికి పిర్యాదు కూడా చేసారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే తన అనుచరులను గుండ్లపల్లి ఎంపీటీసీ సభ్యులు లోకేశ్వర్ రెడ్డి ఇంటికి పంపి, లోకేష్ రెడ్డి తల్లిదండ్రులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ దురాగతాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు పూతలపట్టు నాయకులు. పూతలపట్టు నియోజకవర్గానికి తలమానికమైన కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో కూడా అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని అందులో ముఖ్యంగా ఎమ్మెల్యే పాత్రుందని నాయకుల ఆరోపిస్తున్నారు.ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలకు ఎవరు అడ్డుపడినా వారి ఆస్తులు, ఆర్థిక వనరులపై దాడులు చేయిస్తారని ఆరోపించారు.అప్పటికి లొంగకుంటే భౌతిక దాడులకు సైతం పాల్పడేందుకు వెనకాడరని మండిపడ్డారు నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి తనకు సంబంధించినంత వరకు ఆస్తులను కూడా బెట్టుకుంటున్నారే తప్ప పూతలపట్టు నియోజకవర్గం లోని ప్రజలను కానీ నాయకులను కానీ ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని పార్టీ కోసం తీవ్రంగా శ్రమించిన నాయకులు అంతా ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు పనితీరుపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఇటీవల పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే … వేడుకలు నిర్వహించిన పలువురు రేషన్ షాపుల యజమానులను అనేక రకాలుగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. గతంలో తన భర్త చరణ్ రెడ్డి పైన సైతం ఎమ్మెల్యే అనుచరులు దాడికి ప్రయత్నించారని ఆరోపించారు.కాని గతంలో టిడిపి నుంచి గెలిచిన అభ్యర్థి ఎంతో కొంత పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజలకు చేరువుగా ఉన్నారని స్వయంగా వైసిపి నాయకులే ఒప్పుకుంటున్నారు.ప్రజా సంక్షేమాన్ని,తనకు ఘన విజయం అందించిన పార్టీ నాయకులు, కార్యకర్తలను గాలికి వదిలి గూండాగిరి చేస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు తమకు వద్దని, అయితే తాము జగన్మోహన్ రెడ్డి, జిల్లాకు చెందిన వైఎస్ఆర్సిపి ముఖ్య నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విధేయులుగా ఉంటామని,వారి అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు నాయకులు.
గుండ్లపల్లి ఎంపీటీసీ సభ్యుడి తల్లిదండ్రులపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
94
previous post