చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం బోడబండ్ల గ్రామ సమీపంలోని చిగర్లబండ వద్ద గురువారం రాత్రి సుమారు 2గంటల ప్రాంతంలో సుమారు 10 ఏనుగుల గుంపు.. మునీంద్ర, హరి, వెంకటేష్, మురళి రైతులకు చెందిన మామిడి పంట పొలాల్లో ఉన్న కొబ్బరి, అరటి, మామిడి పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగుల వినికిడికి ఆవులు బయపడి తాళ్ళూ తెంపుకొని అడవిలోకి వెళ్లిపోయినట్లు రైతులు తెలిపారు. శుక్రవారం ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు ధ్వంసమైన పంటలను చూసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. తన బృందంతో అక్కడికి చేరుకుని నష్టపోయిన పంటను పరిశీలించిన బీట్ ఆఫీసర్ జి.ప్రతాప్ మాట్లాడుతూ పంట నష్టంపై అధికారులకు తెలిపి రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వానికి సిపార్సు చేస్తామని తెలిపారు. అలాగే ఏనుగుల గుంపును బోడబండ్ల నుండి యాదమరి వైపు మల్లిస్తామని తెలిపారు. ఏనుగుల దాడిలో సుమారు 1,50,000 రూ పంట నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.
Read Also..